వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అమరావతి'కి రెండు బలాలు: బాబు, ఇదీ ఏపీ రాజధాని.., ఇండస్ట్రీ పాలసీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు. రాజధానికి వాస్తుతో పాటు పేరు బలం కూడా కుదిరిందన్నారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. అమరావతి పేరును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. అమరావతికి చరిత్ర ఉందన్నారు. శైవ, వైష్ణవ, జైన, బౌద్ద, హిందు తదితర అన్ని రకాల చరిత్ర ఉందని చెప్పారు.

ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతికి పేరు ఉందన్నారు. నాలుగు వందల ఏళ్ల పాటు అమరావతిని రాజధానిగా శాతవాహనలు పాలించారన్నారు. అమరావతికి ధాన్యకటకంగా కూడా పేరు ఉందన్నారు. బౌద్దులకు పవిత్రమైన స్థలమన్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన అమరావతికి.. భవిష్యత్తులోను అంతే ప్రాధాన్యత ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా రాజధానిగా చేస్తామన్నారు.

Chandrababu Naidu

అమరావతికి దక్షిణ కాశీగా పేరుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికైన వారసత్వ నగరాల్లో అమరావతి ఉందన్నారు. ఆచార్య నాగార్జున కులపతిగా వ్యవహరించినట్లు ఆధారాలున్నాయన్నారు. రాబోయే తరాలకు ఆదర్శంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరిగేలా చూడాలన్నారు. పేదలకు అనుకూలంగా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామన్నారు.

హేతుబద్దత లేకుండా రాష్ట్ర విభజన చేశారని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారన్నారు. విపక్షాలు రాజకీయం చేయాలనుకున్నప్పటికీ రైతులు సహకరించారని వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. రైతులకు కృతజ్ఞతలు చెప్పారు.

మే 15 నాటికి రాజధాని బృహత్ ప్రణాళిక నివేదిక అందుతుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రమని చాలా కష్టాలు ఉన్నాయన్నారు. స్వచ్ఛ భారత్‌కు నన్ను కోఆర్డినేటర్‌గా పెట్టారని చెప్పారు. విదేశీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని, భూముల ధరలు పెరుగుతాయన్నారు.

ఇదీ రాజధాని....

ఓడరేవు - మచిలీపట్నం కారిడార్ అభివృద్ధి
జాతీయ రహదారులు 5, 9, 214 అనుసంధానం చేస్తూ రింగ్ రోడ్డు
రాజధాని ప్రాంతానికి రేడియల్ రోడ్లతో అనుసంధానం
నిజాంపట్నం ఓడ రేవును ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుస్తాం
రైల్వే నెట్ వర్క్ పెద్ద ఎత్తున పెంచుతామన్నారు. మెట్రో కాకుండా దీనిని చేస్తామన్నారు.
కృష్ణా నది పైన ఐదు బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు
జాతీయ హైస్పీడ్ రైలు విజయవాడ - చెన్నై మీదుగా
వరల్డ్ క్లాస్ రాజధానిగా చేసేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం
విజయవాడ - గుంటూరును కలుపుతూ 200 కిలోమీటర్ల రింగు రోడ్డు
కృష్ణా నదిపై 5 వంతెనలు
అభివృద్ధి కారిడార్లుగా విశాఖ - చెన్నై, మచిలీపట్నం - కాకినాడ
రాజమండ్రి నుండి భద్రాచలం వరకు జల రవాణా మార్గం
రాజమండ్రి నుండి భద్రాజం వరకు జల రవాణా మార్గం
గుడివాడ కారిడార్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
గన్నవరంలో ఐటీ కారిడార్
నందిగామలో ఫార్మా కారిడార్
24X7 విద్యుత్ ఇస్తాం
రూ.50 కోట్లు పెట్టుబడులు పెడితే 25 శాతం రాయితీ
పారిశ్రామిక అనుమతులుకు సింగిల్ డెస్క్ విధానం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ రాయితీ. మహిళలకు కూడా రాయితీ

క్యాపిటల్ రీజియన్.. రేడియల్ రీజియన్ రోడ్లు శాటిలైట్ టౌన్‌షిప్స్‌తో తయారవుతుంది
మచిలీపట్నం ఒక లాజిస్టిక్ హబ్
ఒక ఔటర్ రింగు రోడ్డు 210 కిలోమీటర్లు
కేంద్రం చట్టంలోనివే కాకుండా అదనంగా సహకరించాలి. అప్పుడే నిలబడుతుంది
2015-16 బడ్జెట్లో పలు విద్యా సంస్థలు కేంద్రం ఇచ్చింది

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఏం చేయలేదు.
కొత్త పరిశ్రమలకు రోడ్లు, విద్యుత్, భూమి ఇస్తాం
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 5.8 మిలియన్ల జనాభా ఉంది. 2050 నాటికి 50 మిలియన్ల జనాభా
కొత్త పరిశ్రమలకు ఆన్ లైన్లో దరఖాస్తు చేస్తే పరిశీలన
హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉందంటే దానికి కారణం మేం
బోగాపురం నుండి కాకినాడ వరకు మూడు ఎయిర్ పోర్టులు, రెండు పోర్టులు
త్వరలో మరో 4, 5 సెక్టార్ పాలసీలు
కర్నూలు రాజధానికి ఆరు లైన్ల రోడ్డు
ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు

కొత్త ఇండస్ట్రీ పాలసీ..

పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా
యూనిట్‌కు రూపాయి చొప్పున తిరిగి చెల్లించేలా నిర్ణయం
ఎక్కువ పరిశ్రమలు వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది
దేశంలోనే నెంబర్ వన్ పారిశ్రామిక పాలసీ
నేను ఏపీ అభివృద్ధి కోసం పర్యటిస్తున్నా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు వంద శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు
నూతన పారిశ్రామిక విధానం 2015 నుండి 2020 వరకు అమలులో
ప్రతి నెల 3, 16 తేదీల్లో సమావేశాలు
వివరాలు ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు ఉంటాయి
కాంగ్రెస్ పదేళ్లలో పారిశ్రామిక అభివృద్ధికి రూ.1200 కోట్లు ఖర్చు చేశారు.
మేం ఈ ఏడాదిలోనే రూ.2056 కోట్లు ఖర్చు చేశాం
పారిశ్రామికవేత్తలకు గరిష్టంగా 9 శాతం రాయితీ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు అధిక ప్రాధాన్యత
రోడ్డు, రైలు, షిప్, విమాన కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం
సింగిల్ డెస్క్ విధానం ఏర్పాటు

English summary
AP CM Chandrababu announces capital name and says about capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X