వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జరిగింది: బాబు ఆరా, కేశినేనిXదేవినేని, గంటా-అయ్యన్న ఎత్తులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధిష్టానం మాటే... తమ మాట అంటూనే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చిక్కులు తెస్తున్నారు. శుక్రవారం నాడు జరిగిన రెండు విషయాల పైన చంద్రబాబు కొంత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లాలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే మంత్రులు గంటా శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడులు అధినేతకు తలనొప్పి పెడుతున్నారంటున్నారు.

కేశినేని నాని మంత్రి దేవినేని పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలల పాలనలో విజయవాడకు ప్రభుత్వం చేసిందేమీ లేదని, జిల్లా దేవినేని సొత్తు ఏం కాదని, ఆయనే అందర్నీ కలుపుకుపోవాలని నాని మండిపడ్డారు. ముంబై, ఢిల్లీల్లో కూడా లేని విధంగా విజయవాడలో నైట్ తనిఖీలు ఏమిటని ప్రశ్నించారు. అధికారుల తీరు పైన ఆయన మండిపడ్డారు.

AP CM Chandrababu facing heat

కేశినేని వ్యాఖ్యల పైన దేవినేని కూడా స్పందించారు. నాని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మంత్రి నారాయణ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు వంటి వారు మాత్రం ఏదైనా సమస్య ఉంటే పార్టీలో చర్చించుకోవాలన్నారు.

అయితే, బెజవాడలో దేవినేని, కేశినేనిల మధ్య జరుగుతున్న రగడ చంద్రబాబుకు కొత్త తలనొప్పి తీసుకు వచ్చినట్లే అంటున్నారు. ఇది తెలిసిన చంద్రబాబు... నాని పైన అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. కేశినేని నాని వ్యాఖ్యల పైన అధిష్టానం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్ర రావుల విషయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గంటాల మధ్య చిచ్చు రాజుకుందని అంటున్నారు. కొణతాల, దాడిలను టీడీపీలోకి తీసుకునే విషయమై ఈ ఇద్దరు మంత్రులు గంట పాటు చర్చించారని సమాచారం.

వారి రాక పైన ఈ మంత్రుల మధ్య విభేదాలు వస్తున్నాయని అంటున్నారు. కొణతాల రాక గంటాకు ఇష్టం లేదని, దాడి రాక అయ్యన్నకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.

ఒకవేళ ఎవరినైనా ఒకరిని తీసుకుంటే, మిగిలిన వారిని పార్టీలోకి తీసుకు రావాలని ఈ మంత్రులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకరి పైన మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే, చురకలు వేసుకుంటూనే.. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కలిసి పని చేస్తామని వారు చెప్పడం గమనార్హం.

English summary
AP CM Chandrababu Naidu facing heat from ministers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X