వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడే: జపాన్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆఫర్, కీలక ఒప్పందాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోక్యో: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్‌ పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజు పర్యటనలో భాగంగా ఇసెకి, హిటాచి, మిట్సుబిషి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇసెకి ఎండీ యోసియోకి టయోడాతో సమావేశమైన బాబు అనంతరం ఎస్‌ఎంబీసీ సీనియర్‌ అడ్వైజర్‌ ఫ్యూమియో హోషీతో సమావేశమయ్యారు.

హిటిచి వైస్‌ప్రెసిడెంట్‌ అకీరా షిమూజీతో బాబు భేటీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్‌ల నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను బాబు వివరించగా మూడు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఏపీలో పర్యటించనున్నట్లు చంద్రబాబుకు మూడు సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు.

పన్నుల రాయితీ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయని కంపెనీల ప్రతినిధులు చెప్పగా.. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వాములమని, పెద్దగా సమస్యలేమీ రావని జపాన్‌ ప్రతినిధులకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

టోక్యోలో నిర్వహించిన సెమినార్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రలో అవకాశాలన్ని అందుకోవాలని జపాన్ పారిశ్రామికవేత్తలను కోరారు. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి కావలసిన అనుమతులను టోక్యోలోనే అందిస్తామన్నారు. ఇందుకోసం టోక్యోలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనుమతులు తీసుకోవడానికి ఆంధ్రకు రానవసరం లేదని, అన్ని లైసెన్సులనూ ఇక్కడే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

జపాన్ పర్యటనలో చంద్రబాబు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. చంద్రబాబు గురువారం అక్కడి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధానంగా సుమిటోమో సంస్థతో ఇందుకు సంబంధించి సంతకాలు జరిగాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్రంలో వనరుల వెలికి తీతపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించారు.

భారతదేశంలో రెండో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అనేక వ్యవసాయ వనరులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి బృందం అధ్యయనం చేస్తుంది. అలాగే విద్యుత్ రంగంలో తక్షణమే విద్యుదుత్పత్తిని పెంచేందుకు కూడా మరొక ఒప్పందం కుదిరింది.

శ్రీకాకుళం జిల్లా నాలుగు వెయ్యి మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆధునిక విధానాలు అవలంభించేందుకు జపాన్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఆహార ఉత్పత్తులకు సంబంధించి విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు మరొక ఒప్పందం కుదుర్చుకున్నారు.

AP CM Chandrababu Naidu inks 4 pacts with Japan's Sumitomo

ఇక అత్యంత కీలకంగా భావిస్తున్న రాజధాని నిర్మాణంలో కూడా అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ సిటీని నిర్మించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు సుమిటోమోతో ఒప్పందం కుదిరింది. దీనికోసం ఒక బృందాన్ని సర్వేకు పంపించాలని నిర్ణయించారు.

మరో భేటీలో ఇసుజీ మోటార్స్ సంస్థ కూడా రాష్ట్రంలో భారీ ట్రక్కుల ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చింది. సంస్థ ఉపాధ్యక్షుడు మసనోరి కటయామతో జరిగిన భేటీలో రాష్ట్రంలో ఇసుజి ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ప్రపంచంలో ఈ సంస్థకు పది ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.

దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు మసనోరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని శ్రీసిటీ తమ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మసనోరి పేర్కొన్నారు. దేశంలో ఇసుజికి మార్కెట్ బాగుంటుందని, దీనికోసం సహకారం కావాలని చంద్రబాబును కోరారు.

జపాన్ నుంచి మరికొన్ని చిన్న, మధ్యస్థాయి సంస్థలు కూడా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలో ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతామన్నారు. మయెవాక సంస్థతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ పార్కులను ఏర్పాటుచేసేందుకు సహకారం అందించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. అలాగే ఆసుపత్రుల్లో రిఫ్రిజిరేషన్ కంప్రెసర్లను ఉపయోగించేలా కూడా చర్యలు చేపట్టనున్నట్లు సంస్థ చైర్మన్ తనాకా వెల్లడించారు.

వివిధ పథకాలకు రుణాలు అందించే జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ) ప్రతినిధులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. జపనీస్ ఇండస్ట్రియల్ పార్క్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. జైకా సీనియర్ ఉపాధ్యక్షుడు హడీరి దొమిచి కూడా వివిధ అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఏపీలో జైకా కార్యాలయం ప్రారంభించాలని కోరారు.

బెంగళూరు - చెన్నై పారిశ్రామిక కారిడార్‌పై తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కృష్ణపట్నం ఓడరేవు నిర్మాణానికి కూడా సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ పైన గట్టి విశ్వాసం ఉందని దొమిచి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో పాటు, ఔటర్ రింగు రోడ్డు, ఇతర అంశాలకు తాము ఆర్ధిక సహకారం అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో భూమి అందుబాటులో ఉందని, వివిధ సంస్థలకు అనుమతులు కూడా త్వరగా ఇచ్చేలా చూస్తున్నామన్నారు. పారిశ్రామిక వాడలు, పోర్టులకు రహదారి సౌకర్యాలు కల్పించేందుకు సాయం అందించాలని చంద్రబాబు కోరారు. మరో ప్రధాన ఆర్ధిక సంస్థగా ఉన్న జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (జెబిఐసి)తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు.

రాష్ట్రంలో వివిధ నగరాల మధ్య రవాణా అనుసంధానంకోసం, పట్టణ ప్రాంతాల్లో నీటి నిర్వహణపై సహకారానికి జెబిఐసి సానుకూలంగా స్పందించింది. సింగపూర్ దేశం కొత్త రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చిందని, వారితో కలిసి పని చేసేందుకు జపాన్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

English summary
AP CM Chandrababu Naidu has signed four key agreements with Japanese giant Sumitomo Corporation and received investment interest from Isuzu Motors, Mayewaka Manufacturing and Kubota Corporation, presenting tough competition to neighbouring states with Japanese investments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X