వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు జపాన్ పర్యటన: తొలి రోజు విశేషాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జపాన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. తొలిరోజు ఎన్‌మార్ కంపెనీతో సమావేశమయ్యారు.

వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఈ కంపెనీలో విధానాలను పరిశీలించారు. వ్యవసాయ పనిముట్ల తయారీలో సాయపడాలని ఎన్‌మార్‌ను కోరారు.ఇక్రిశాట్‌తో కలిసి ప్రభుత్వం చేపట్టే చర్యలను వారికి వివరించారు.

వ్వవసాయానికి సంబంధించిన ఆధునిక సాగు యంత్రాల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో స్దాపించాలని కోరారు. పరిశ్రమలు స్ధాపించడం వల్ల ఆసియాలో ఎక్కువగా వ్యాపారం చేసే అవకాశం ఉందన్నారు.

వ్యాపారాన్ని విస్తరించేందుకు రాష్ట్రంలో పోర్టులు దోహదం చేస్తాయని చంద్రబాబు చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తామన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన ప్రాంతమన్నారు.

AP CM Chandrababu naidu team reached Japan

ఆ తర్వాత వెంటనే చంద్రబాబు ఎన్ఐడీఈసీ చైర్మన్ షిహనోబు నోరితో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఎన్ఐడీఈసీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

తన జపాన్ పర్యటలో భాగంగా సోమవారం ఉదయం జపాన్‌ చేరుకున్నారు. జపాన్‌ పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా జపాన్‌లో ఐదు రోజుల పాటు చంద్రబాబు పర్యటన ఉంటుంది. సీఎం చంద్రబాబుతో పాటు ప్రత్యేక విమానంలో 18 మంది ప్రతినిధుల బృందం జపాన్‌కు వెళ్లింది.

English summary
Andhra Pradesh chief minister Chandrababu naidu team reached Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X