వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానికి తుదిరూపు: సింగపూర్‌లో బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రణాళికలకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి ప్రతినిధులతో వరుస సమావేశాలు జరిపారు. కాగా, మరో ఆరువారాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు సింగపూర్ బృందం వెల్లడించింది.

రాజధాని మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఇప్పటికే అవుట్‌లైన్ ప్లాన్ సిద్ధం చేసిన సింగపూర్, ఈ మేరకు ఆంధ్ర బృందానికి ప్రణాళికను వివరించింది. ఈ సందర్భంగా సింగపూర్ బృందానికి ల్యాండ్ పూలింగ్‌పై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. అనంతరం అసెండాక్స్, సెమ్‌కార్ప్‌తో చర్చలు జరిపారు.

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రెండురోజులుగా బిజీ బిజీగా గడిపారు. ఏపీ రాజధాని అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన అవుట్‌లైన్ ప్లాన్‌కు మరికొన్ని సవరణలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాబోయే ఆరువారాల నుంచి ఎనిమిది వారాల్లో ప్రణాళికకు మరిన్ని మెరుగులు దిద్దుతామని సింగపూర్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ బృందం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ జరిగిన తీరును వివరించారు.

రాజధాని ప్రాంతానికి రెండు రింగ్‌రోడ్లు, అనేక రేడియల్ రోడ్లు నిర్మాణం ద్వారా కోర్ క్యాపిటల్ ఏరియాతోపాటు పరిసర ప్రాంత పట్టణాలనూ కలిపేలా ప్లాన్ రూపొందించారు. రాబోయే ఆరువారాల్లో జరిగే మరో సమావేశం నాటికి మార్చిన ప్రణాళికతో సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అధికారులు తెలిపారు. సీడ్ క్యాపిటల్ ప్లానింగ్‌ను తర్వాతి దశలో చేస్తారు. సింగపూర్ పర్యటన సందర్భంగా అసెండాక్స్, సెమ్‌కార్ప్‌వంటి సంస్థల ప్రతినిధులతో సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రణాళికలకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి ప్రతినిధులతో వరుస సమావేశాలు జరిపారు. కాగా, మరో ఆరువారాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు సింగపూర్ బృందం వెల్లడించింది.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

రాజధాని మాస్టర్ ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. ఇప్పటికే అవుట్‌లైన్ ప్లాన్ సిద్ధం చేసిన సింగపూర్, ఈ మేరకు ఆంధ్ర బృందానికి ప్రణాళికను వివరించింది.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

ఈ సందర్భంగా సింగపూర్ బృందానికి ల్యాండ్ పూలింగ్‌పై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. అనంతరం అసెండాక్స్, సెమ్‌కార్ప్‌తో చర్చలు జరిపారు.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రెండురోజులుగా బిజీ బిజీగా గడిపారు. ఏపీ రాజధాని అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన అవుట్‌లైన్ ప్లాన్‌కు మరికొన్ని సవరణలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

రాబోయే ఆరువారాల నుంచి ఎనిమిది వారాల్లో ప్రణాళికకు మరిన్ని మెరుగులు దిద్దుతామని సింగపూర్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ బృందం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ జరిగిన తీరును వివరించారు.

సింగపూర్‌లో బాబు

సింగపూర్‌లో బాబు

రాజధాని ప్రాంతానికి రెండు రింగ్‌రోడ్లు, అనేక రేడియల్ రోడ్లు నిర్మాణం ద్వారా కోర్ క్యాపిటల్ ఏరియాతోపాటు పరిసర ప్రాంత పట్టణాలనూ కలిపేలా ప్లాన్ రూపొందించారు. రాబోయే ఆరువారాల్లో జరిగే మరో సమావేశం నాటికి మార్చిన ప్రణాళికతో సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఐటి పార్కుల అభివృద్ధికి అసెండాక్స్ సంస్థ ప్రసిద్ధిగాంచగా, థర్మల్ సహజవాయు, పవన ఆధారిత విద్యుత్కేంద్రాల ఏర్పాటు, టౌన్‌షిప్‌ల అభివృద్ధిలో సెమ్‌కార్ప్ పేరొందింది. ఏపీలో వివిధ జిల్లాల్లో చేపట్టే ఐటి పార్కుల అభివృద్ధి, పవర్‌ప్లాంట్‌ల సాధన, టౌన్‌ల అభివృద్ధిపై ఈ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. సింగపూర్‌లో సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ అక్కడి నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఏజన్సీల ద్వారా అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ కొత్త సాంకేతిక పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం పరిశీలించింది.

English summary
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, who reached Singapore on Monday, began holding a series of meetings with ministers and top officials in Singapore Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X