వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అక్రమాస్తులపై చంద్రబాబు కన్ను! ఏపీకి అరుణ్ జైట్లీ సలహా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించిన అక్రమార్కుల ఆస్తులు రాష్ట్రానికి దక్కేలా ఓ బిల్లు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు తేవాలని చూస్తోంది. తద్వారా జగన్ అక్రమాస్తులు, ఎర్ర చందనం ప్రభుత్వానికి దక్కే అవకాశముందని అంటున్నారు.

శనివారం నాడు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని టిడిపి మొదటి నుంచి ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. సదరు అక్రమాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంటామని కూడా ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

తాజాగా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జగన్ అక్రమాస్తులతో పాటు ఇతరులు పోగేసిన అక్రమాస్తులను కూడా స్వాధీనం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చట్టంను తెచ్చే విషయమై కేబినెట్లో చర్చించారు.

AP government may bring act on illegal assets

శనివారం నాటి కేబినెట్ సమావేశంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అక్రమార్కుల సొమ్ముతో పాటు వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు కూడా తమకే చెందే విధంగా చట్టాన్ని రూపొందించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారట కూడా. ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా ఈ తరహా యత్నాలు ఫలించవని, ప్రత్యేక చట్టంతోనే అది సాధ్యమని జైట్లీ సూచించారని తెలుస్తోంది.

జైట్లీ సూచనలతోనే ఏపీ సర్కారు కొత్త చట్టం రూపకల్పనకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. ఇప్పటిదాకా అవినీతి కేసులను దర్యాప్తు చేస్తున్న ఈడీ లాంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆయా కేసుల్లో నిందితులు దోషులుగా తేలితే, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి వచ్చిన సొమ్మును కేంద్ర ఖజానాలో జమ చేస్తున్నాయి.

అయితే తమ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సొత్తు కేంద్ర ఖాతాలో వేయడం సబబు కాదన్న వాదనే కొత్త చట్టం రూపకల్పనకు నాంది పలికిందని తెలుస్తోంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టిన కేసుల్లోని ఆస్తులను చేజిక్కించుకోవాలంటే సదరు చట్టానికి కేంద్రం ఆమోదం తప్పనిసరి అవసరం.

అయితే కేంద్ర ఆర్థిక మంత్రి సూచనల మేరకు తాము రూపొందిస్తున్న ఈ చట్టానికి కేంద్రం ఆమోదం సులువుగానే లభిస్తుందని కూడా చంద్రబాబు ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఇక్కడ మరో చిక్కు ఉంది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే, మిగతా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు.

English summary
AP government may bring act on illegal assets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X