హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో ఏపీ గణతంత్రం: పుణ్యఫలమన్న గవర్నర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 66వ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. తొలుత జాతీయ జెండా ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పింగళి వెంకయ్య స్వస్ధలంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎందరో మహానీయుల జన్మభూమి... ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం ఎంతో అదృష్టమని అన్నారు. ఇది నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

AP Governor Narasimhan R-Day speech in vijayawada

ప్రజలకు మరింత చేరువగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ ఆదర్శంగా ఉండేలా కొత్త రాజధాని నిర్మాణం ఉంటుందని చెప్పారు. ఏడు మిషన్లు, 5 గ్రిడ్లతో ఏపీ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. మూడు మెగాసిటీలు, 13 స్మార్ట్‌ సిటీలు నిర్మించనున్నట్లు గవర్నర్‌ చెప్పారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* మార్చి 31లోగా అన్ని శాఖాల్లో ఈ-గవర్నెన్స్
* త్వరలో కృష్ణపట్నం వద్ద 1600 మెగావాట్ల ధర్మల్ విద్యుత్
* రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుదాం
* పోలవరం కాలువల నిర్మాణం 50 శాతం పూర్తైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పోరుగు రాష్ట్రాలతో చర్చించాం
* స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
* ప్రభుత్వ హాస్టల్లో సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు
* పరిశ్రమల అనుమతులకు సింగల్‌ డెస్క్‌ను ఏర్పాటు

English summary
Andhra Pradesh Governor ESL Narasimhan Republic Day speech in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X