విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తాయిలం: అమరావతికి వెళితే పని 5 రోజులే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సరైన సౌకర్యాలు కల్పించకుండా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేయలేమని ఉద్యోగులు తేల్చి చెబుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వారికి కొత్త తాయిలాన్ని ఆశ చూపనున్నట్లు తెలుస్తోంది. రాజధాని
అమరావతి
ప్రాంతంలో పని చేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులు పనిదినాలుగా అమలు చేస్తామని చెబుతోంది.

విజయవాడలోని కొన్ని భవంతులను అద్దెకు తీసుకుని, వాటిల్లో ప్రధాన కార్యాలయాలను నిర్వహించడం ప్రారంభించాలని, ఆపై దశలవారీగా అన్ని ఆఫీసులనూ తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని అమరావతికి అన్ని శాఖలను తరలించాలని ఇటీవలే మంత్రి వర్గంలో నిర్ణయిస్తూ అందుకు ఓ కమిటీని కూడా చంద్రబాబు వేసిన సంగతి తెలిసిందే.

Ap govt gave offer to employees 5 days work in amaravati

ఇక రాజధాని అమరావతికి ప్రభుత్వ శాఖల తరలింపుపై ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఈరోజు ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. టర్కీ పర్యనటలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి రాగానే ఏదు రోజుల పనిదినాలపై ఓ నిర్ణయం తీసుకుంటాని అధికారులు చెబుతున్నారు.

దీంతో పాటు సీఎంఓలో కూడా చంద్రబాబు పలు మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి పుష్కరాల ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని సీఎం సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

‘పుష్కరాల్లో అధికారులు చెమటోడ్చి పనిచేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా సరైన బ్యారికేడింగ్‌ పెట్టి ప్రజలను అందులో నుంచి పంపించి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదు. ఆ తర్వాత రెట్టింపు సంఖ్యలో ప్రజలు వచ్చినా సమస్య పునరావృతం కాలేదు. పని చేసిన అధికారులను శిక్షించాల్సిన అవసరం లేదు' అని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపాయి.

పుష్కరాల తొక్కిసలాట సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించినందువల్ల నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.

English summary
Ap govt gave offer to employees 5 days work in amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X