వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఐఏఎస్‌లలో ముసలం.. రెండుగా చీలిక, టీటీడీ ఈవో పోస్టింగ్‌ కోసం పోటాపోటీ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ కేడర్‌ అధికారులు రెండు వర్గాలుగా చీలి పోయారు. తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ఈవో పోస్టింగ్‌ కోసం ఉత్తరాది, దక్షిణాది అధికారుల మధ్య తీవ్ర పోటి నెలకొన్నట్లు తెలిసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ కేడర్‌ అధికారులు రెండు వర్గాలుగా చీలి పోయారు. రాష్ట్రంలోని వివిధ కేడర్‌లకు చెందిన ఐఏఎస్‌ల బదిలీలు జరగనుండటంతో కొన్ని పోస్టులను తమకు ఇవ్వాలంటే.. తమకే ఇవ్వాలని ఉత్తరాది, దక్షిణాదికి చెందిన అధికారులు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ఈవో పోస్టింగ్‌ కోసం ఉత్తరాది, దక్షిణాది అధికారుల మధ్య తీవ్ర పోటి నెలకొన్నట్లు తెలిసింది. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న ఏకే సింఘల్‌ టీటీడీ ఈవో పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఈ చిచ్చు రాజుకుంది.

andhra pradesh

ఉత్తరాది వ్యక్తయిన సింఘల్‌కు టీటీడీ ఈవో పోస్టు ఇవ్వొద్దని, ఈవో పోస్టుకు తన పేరును పరిశీలించాలని జవహర్‌రెడ్డి కోరినట్లు తెలిసింది. కొందరు ముఖ్య అధికారులు ఏకే సింఘల్‌కు మద్దతిస్తున్నారంటూ జవహర్‌ రెడ్డి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారని సమాచారం.

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా టీటీడీ ఈవో పోస్టు దక్షిణాదికి చెందిన ఐఏఎస్ అధికారికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా.. ఈవో పోస్టుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

English summary
Vijayawada: It was just a proposal, but it triggered a controversy. The AP government has proposed Anil Kumar Singhal, the resident commissioner of AP Bhavan, New Delhi, for the post of Tirumala Tirupati Devasthanam (TTD) Executive Officer (EO). Senior IAS officers are opposing the proposal, but top politicians are pressuring the government to make the appointment. Barring one or two exceptions, the government has always appointed IAS officers who belong to Andhra Pradesh to the TTD executive officer’s post. Those opposed to the appointment say the TTD EO should understand Hindu culture and TTD conventions, and it is very difficult for an IAS officer from North India to understand the TTD conventions and culture. Mr Singhal is an Andhra Pradesh cadre, 1993 batch IAS officer from Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X