వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ ఫలితాలు విడుదల: కృష్ణా టాప్, కడప లాస్ట్, బాలికలదే హవా

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియ్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12గంటలకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డి ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియ్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12గంటలకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డి ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్థతా శాతంలో బాలికలు పైచేయి సాధించారు.

ఇంటర్ సెకండియర్‌లో 69శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, 60శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.

AP Intermediate 1st and 2nd Year Results 2017 Released

ఫస్ట్ ర్యాంక్ ర్యాంకర్లు
ఎంపీసీలో షేక్ ఫర్మాలా(992)
ఎంఈసీలోనేహా (983)

గతంలో కంటే ప్రాక్టీస్ కేసులు తక్కువగా నమోదయ్యాయని మంత్రి గంటా చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు. నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.
కేవలం 24రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశామని గంటా చెప్పారు.

స్పాట్ వాల్యూయేషన్‌లో బయోమెట్రిక్ సిస్టమ్ వినియోగించామని తెలిపారు. మొత్తం 10లక్షలా 31వేల మంది పరీక్ష రాశారని తెలిపారు.

ఫస్టియర్ ఫలితాల్లో..

77శాతంతో ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 69శాతంతో నెల్లూరు జిల్లా ద్వితీయం స్థానం దక్కించుకుంది. 67శాతంతో పశ్చిమగోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచింది.

సెకండియర్ ఫలితాల్లో

86శాతంతో కృష్ణా జిల్లా టాప్‌లో ఉంది. 80శాతంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో గుంటూరు నిలిచింది. కాగా, ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

కాగా, సెకండియర్ ఫలితాల్లో గతం కంటే 3శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదైందని మంత్రి చెప్పారు. మే15న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో కూడా గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.

English summary
Andhra Pradesh Intermediate 1st and 2nd Year Results 2017 Released on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X