వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా! మా మనోభావాలు దెబ్బతిన్నాయి, క్షమాపణ చెప్పండి: ఏపీ పోలీస్ డిమాండ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇటీవల చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం పేర్కొంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇటీవల చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. పోలీసులపై రోజా చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు గురువారం తెలిపింది.

ఎవరెవరు ఏం చేశారానేది తమ రికార్డ్స్‌లో ఉంటాయని.. రోజా హుందాగా వ్యవహరించాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం సూచించింది. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను రోజా వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారులు డిమాండ్ చేశారు.

<strong>దమ్మున్న మగాడేనా?: చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు(వీడియో)</strong>దమ్మున్న మగాడేనా?: చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు(వీడియో)

AP Police fires at MLA rk roja

మహిళా సదస్సు చెడగొడతారనే సమాచారం తమకు వచ్చినందు వల్లే.. ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. పోలీసులను విమర్శించడం జరికాదని రోజాకు హితవు పలికారు. పోలీసులు ఎవరికీ బానిసలు కాదని.. చట్టం, ప్రజలకు మాత్రమే బానిసలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల మహిళా పార్లమెంటు సదస్సుకు వెళ్తున్న రోజాను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు డీజీపీ వింటున్నారని, పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని రోజా ఆరోపించారు. ఇతర నేరాలపై ఎలాంటి నివేదికలు రావుగానీ.. తన విషయంలో మాత్రమే రిపోర్టులు వచ్చాయంటూ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh Police officers association on Thursday fired at YSR Congress Party MLA RK Roja for her comments on police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X