అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాళ్లలోనే..: 'జగన్ చాంబర్లోకి నీళ్లు'పై నారాయణ ట్విస్ట్, ఆ గుర్తులేవి

అసెంబ్లీ భవనంపై పైప్ కట్ చేయడం వల్లే వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చాంబర్లోకి వర్షపు నీరు చేరిందని మంత్రి నారాయణ వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: అసెంబ్లీ భవనంపై పైప్ కట్ చేయడం వల్లే వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చాంబర్లోకి వర్షపు నీరు చేరిందని మంత్రి నారాయణ వెల్లడించారు.

చదవండి: బాబుకు 'రాజధాని' చిక్కు: జగన్ చాంబర్లోకి నీళ్లు.. వీడియో ఇలా లీక్

మంగళవారం కురిసిన భారీ వర్షానికి వెలగపూడి తాత్కాలిక భవనాల్లోని వివిధ బ్లాకుల్లోకి నీరు వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ అసెంబ్లీ భవన నిర్మాణంలో లోపాలు ఉంటే భారీ వర్షాలు కురిసినప్పుడు నీళ్లు ఎందుకు రాలేదని పాయింట్ లాగారు.

పైప్ కట్ చేసిన వారు ఎవరో తేలుస్తాం

పైప్ కట్ చేసిన వారు ఎవరో తేలుస్తాం

పైప్ కట్ చేసిన వారు ఎవరో తేలుస్తామని నారాయణ అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. వైసిపి నాయకులు రాద్ధాంతం చేస్తున్నట్లు శాసనసభ, సచివాలయంలో వర్షం నీరు లీకేజీ లేదని తేల్చి చెప్పారు.

వారే ఎవరో చేశారు

వారే ఎవరో చేశారు

జగన్ గది పైభాగంలో ఏసీ ప్లాస్టిక్‌ పైప్‌ను ఎవరో ఉద్దేశపూర్వకంగా కోసేయడం వల్లే ఆయన గదిలోకి వర్షం నీరు చేరిందని నారాయణ తెలిపారు. జగన్‌ కార్యాలయం సిబ్బంది, వారి ద్వారా వచ్చిన వ్యక్తులు చేసిందే ఈ విద్రోహ చర్య అని నారాయణ మండిపడ్డారు.

వైసిపి ఉద్దేశ్యం ఇక్కడే తెలిసిపోతోంది

వైసిపి ఉద్దేశ్యం ఇక్కడే తెలిసిపోతోంది

కార్యాలయంలోకి వర్షపు నీరొస్తే ఆ విషయాన్ని స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికో ఫిర్యాదు చేయకుండా వీడియోలు తీసి మీడియాకు, సోషల్ మీడియాకు పంపారంటేనే వారి ఉద్దేశమేమిటో అర్థమవుతోందని మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.

ఆ గుర్తులేవి.. స్పీకర్

ఆ గుర్తులేవి.. స్పీకర్

కాగా, ఈ అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాద రావు సిబిఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. వర్షపు నీరు సీలింగ్‌ నుంచి లీకయితే గోడలపై చారలుండాలని, గుమ్మరించినట్లుగా ఒకేచోట నీళ్లెందుకు పడతాయని, దీనిని ఎవరో కావాలనే చేశారని అర్థమవుతోందని స్పీకర్ అన్నారు.

నాపై బాధ్యత... విచారణ

నాపై బాధ్యత... విచారణ

భవనాలను లోపభూయిష్టంగా నిర్మించారని, నిధుల దుర్వియోగం జరిగిందని ప్రచారం చేస్తున్నారని కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌గా తనపై ఉందని, పైపు ఎవరు కోశారనేదీ సీసీటీవీ ఫుటేజీల ద్వారా పరిశీలిస్తారని, ఆధారాలను ఫోరెన్సిక్‌ సైన్‌ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి కూడా పంపి నిర్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

English summary
The rain water leakage into the leader of opposition YS Jagan's chamber in the new Assembly-Secretariat building has created a furore among the YSRCP leaders who are staging protests against the AP govt and Chief Minister Chandrababu Naidu over for poor quality works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X