వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బట్టలూడదీసి పంపిస్తారు: జగన్‌పై అయ్యన్న పాత్రుడి ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ayyanna Patrudu
విశాఖపట్నం: పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌ ఉన్నా ఎంతో శ్రమించి ఎన్నికల హామీలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ప్రభుత్వ పరిపాలన గురించి ఏం తెలుసునని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన జగన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్‌కు ఏం తెలుసునని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 లక్షల 40 వేల మంది రైతుల్లో తొలి విడతగా 26 లక్షల 77 వేల మంది రుణాలను మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రుణ మాఫీ నిర్ణయాన్ని అమలు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ అమలు సాధ్యం కాదన్న జగన్‌, ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో ఆయనకే తెలియదన్నారు.

కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు ఆహార పొట్లాలు విసరడం తప్ప ముఖ్యమంత్రి ఏం చేశారంటూ విమర్శించిన జగన్‌, విశాఖ తుఫాన్‌ బాధితులను కుక్కలతో పోల్చడం అవమానకరమన్నారు. జగన్‌ మూర్ఖత్వంతో నోరు పారేసుకుంటే విశాఖ జిల్లా ప్రజలు జగన్‌ బట్టలూడదీసి పంపిస్తారన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేయరాదంటూ, భూముల సేకరణను వ్యతిరేకిస్తామం టూ జగన్‌ ప్రకటనలు చేయడం రాజకీయ స్వార్థానికి నిదర్శనమని అయ్యన్న అన్నారు.

‘నేడో రేపో జైలు కెళ్లేవాడివి నీకెందుకు రాజకీయాలు' అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. భూములు ఇచ్చేందుకు రైతులందరూ ఆంగీకరించగా వారికి లేని బాధ జగన్‌కు ఎందుకోనన్నారు. చేతనైతే జగన్‌ తన సంపాదనలో 500 కోట్లు వడ్డీ లేకుండా ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు అన్నారు.

English summary
Andhra Pradesh minister Ayyanna Patrudu lashed out at YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X