త్వరలో ఎన్నికలు, సిద్ధంకండి, ఇదీ జగన్ పార్టీ లెక్క: బాబు సంచలనం

తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని నేతలకు సూచించ

Subscribe to Oneindia Telugu

విజయవాడ: తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయని, మరెంతో దూరం లేవన్నారు.

నంద్క్యాలపై మెట్టు దిగిన బాబు: అఖిలప్రియతో జగన్ కొత్త వ్యూహం, తెరపైకి 'భూమా'

ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని నేతలకు సూచించారు. తాను కూడా ఇక నుంచి పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పార్టీ వ్యవహారాల పైన ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పారు.

సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదు

ప్రతి నెలా జిల్లాల్లో బహిరంగ సభలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. ఎన్నికల ప్రచార సభలు కూడా నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు.

వైసిపికి తగ్గిన ఓట్ల శాతం

గతేడాదితో పోల్చుకుంటే టిడిపి ఓట్ల శాతం 16.13 మేర పెరిగిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల ఓట్ల శాతం 13.45 మేర తగ్గిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్క శాతానికే పరిమితమైందన్నారు. ఇక ఎన్నికలే అజెండాగా నేతలందరూ ప్రజల్లోకి వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.

సమాయత్తం కండి

వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలందరూ సమాయత్తం కావాలని చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తన నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ పార్టీల బలాబలాలను ఆయన విశ్లేషించారు.

ప్రోత్సహిస్తాను

నేతలు పోటీతత్వంతో పనిచేస్తే అదే విధంగా తానూ ప్రోత్సహిస్తానని చంద్రబాబు అన్నారు. ఈరోజు సాయంత్రంలోగా జిల్లాలకు ఇంచార్జి మంత్రులను కేటాయిస్తానన్నారు. ప్రతి నెలా ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే పార్టీని బలోపేతం చేయాలన్నారు.

ఇదిలా ఉండగా, గుంటుపల్లిలో సీఎం చంద్రబాబు ప్రజావాణి కాల్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పథకాల్లో ఇబ్బందులు, ప్రజల సమస్యలు తెలిపేందుకు 750 మందితో మెగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

 

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Friday suggested TDP cadre that all are be ready for elections.
Please Wait while comments are loading...