అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నువ్వెంత.. నీ లెక్కెంత: పవన్‌పై టిడిపి ఆగ్రహం వెనుక! 2 వ్యూహాలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు దుమ్మెత్తి పోస్తుండగా, మరికొంత మంది నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్, టీజీ వెంకటేష్ వంటి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

టిడిపిలో 'పవన్ కళ్యాణ్' చిచ్చు: కాళ్లు విరిచేస్తారన్న టీజీపై ఉమ ఆగ్రహం

రాష్ట్రస్థాయి నేతలు పవన్ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందిస్తుండగా, ఎంపీలు దుమ్మెత్తి పోయడం వెనుక ఏమైనా వ్యూహాం ఉందా అనే చర్చ సాగుతోంది. వారు అలా, వీరు ఇలా మాట్లాడటానికి కారణం ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

పవన్! నువ్వెంత, నీ లెక్కెంత అని, హోదా కోసం నీవు ప్రణాళిక రచిస్తే చంద్రబాబును వదిలేసి నీ వద్దకు వస్తామని, తమ పైన విమర్శలు చేయడం సరికాదని, ఇన్నాళ్లు కుంభకర్ణుడిలా నిద్రించావని, పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలియదని టిడిపి ఎంపీలు దుమ్మెత్తి పోశారు.

నివురు గప్పిన నిప్పు.. చంద్రబాబు వారింపు

ప్రశ్నిస్తానన చెప్పిన పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పలు సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు. రాజధాని భూసేకరణ, కాపులకు రిజర్వేషన్లు, సెక్షన్ 8.. తదితర అంశాలపై ఓ విధంగా పవన్ కళ్యాణ్ టిడిపిని ఎంతోకొంత చిక్కుల్లో పెట్టినట్లుగా మాట్లాడారనే చెప్పవచ్చు.

Behind TDP MPs targetting Pawan Kalyan!

2014 తర్వాత స్వరం మారింది

2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహకారంతో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని, కాపు రిజర్వేషన్లు, సెక్షన్ 8పై నిలదీసిన ఆగ్రహం టిడిపికి ఉందని అంటున్నారు. పవన్ నాడు స్పందించిన ఆయా సందర్భాల్లోను వారు దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి.

రివర్స్, పోటాపోటీ: పవన్ కళ్యాణ్‌తో కలిసేందుకు జగన్ సై, వ్యూహమా?

అదే సమయంలో చంద్రబాబు వారిని వారించారు. పవన్ కళ్యాణ్ పైన ఆచితూచి స్పందించాలని ఆయన సొంత పార్టీ నేతలకు పలుమార్లు సూచించారు. హోదా విషయంలో గతంలో పవన్ కేశినేని నాని వంటి వారిని టార్గెట్ చేశారు. అప్పుడు నాని వంటి వారు కౌంటర్ ఇవ్వగా, చంద్రబాబు వారించారు. దీంతో టిడిపి నేతలు తగ్గారు.

ప్రత్యేక హోదా విషయంలో కొంత ట్విస్ట్

ప్రత్యేక హోదా పైన బీజేపీ హామీ ఇచ్చింది. దీనిపై పవన్ బీజేపీతో పాటు టిడిపి ఎంపీల పైనా మండిపడ్డారు. సెక్షన్ 8, కాపు రిజర్వేషన్లు, అమరావతి తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి. కాబట్టి వాటి విషయంలో పవన్ ప్రశ్నించినప్పుడు ఆచితూచి మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు హితబోధ చేసారు.

అయితే, ప్రత్యేక హోదా అంశం కేంద్రం పరిధిలోది కాబట్టి, తమ తప్పు లేదని చెప్పేందుకు ఎంపీలు పవన్ కళ్యాణ్ పైన గట్టిగా ఎదురు దాడి చేసినా ఇప్పుడు చంద్రబాబు వారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రశ్నించిన ఆగ్రహాన్ని కూడా ఎంపీలు చూపిస్తుండవచ్చునని అంటున్నారు. అయితే, పవన్ ఎంపీలను టార్గెట్ చేయడంతో వారికి కోపం తెప్పించిందనే వాదనలు కూడా ఉన్నాయి.

English summary
Behind Telugudesam Party MPs targetting Jana Sena chief Pawan Kalyan!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X