వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రాత్రిపూట జగన్ దందా': సూట్‌కేస్ కంపెనీ.. ఢిల్లీ టూర్‌పై టిడిపి అనుమానం

వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపి జేసీ దివాకర్ రెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు సమస్యలు, కేసులు వచ్చినప్పుడు, కోర్టుల నుంచి సమన్లు వచ్చినప్పుడ

|
Google Oneindia TeluguNews

'రాత్రిపూట జగన్ దందా': ఢిల్లీ టూర్‌పై టిడిపి అనుమానం

అమరావతి: వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపి జేసీ దివాకర్ రెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు సమస్యలు, కేసులు వచ్చినప్పుడు, కోర్టుల నుంచి సమన్లు వచ్చినప్పుడే ఢిల్లీ గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.

<strong>దావుద్ ఇబ్రహీంలా, అన్నీ ఫెయిల్: జగన్‌పై జేసీ దివాకర్ తీవ్ర వ్యాఖ్యలు</strong>దావుద్ ఇబ్రహీంలా, అన్నీ ఫెయిల్: జగన్‌పై జేసీ దివాకర్ తీవ్ర వ్యాఖ్యలు

గతంలో టిడిపి నేతలు కూడా పలుమార్లు ఇదే ఆరోపణ చేశారు. తాజాగా, సాక్షిలో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ జగన్‌ను చిక్కుల్లోకి నెట్టింది.

ఆ ఇంటర్వ్యూను ప్రస్తావించిన సీబీఐ.. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెబుతూ ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు (శుక్రవారం) జగన్ కౌంటర్ దాఖలు చేశారు. అయితే, కేసులు, ఇబ్బందులు వచ్చినప్పుడే జగన్ ఢిల్లీలో పర్యటిస్తారని జేసీ చెప్పడం చర్చకు దారి తీసింది.

జగన్ ఢిల్లీ పర్యటనపై టిడిపి అనుమానం

జగన్ ఢిల్లీ పర్యటనపై టిడిపి అనుమానం

తమ పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించడంపై ఫిర్యాదు చేసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన వెనుక కేసులే కారణమని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే జేసీ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

కేసులు వచ్చినప్పుడే..

కేసులు వచ్చినప్పుడే..

కేసులు వచ్చినప్పుడే ఢిల్లీకి జగన్ వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. యాత్రలు చేస్తే పాపాలు పోతాయని, కష్టాల్లో ఉన్నప్పుడే మనం దేవుడి దర్శనానికి వెళతామని, అలాగే కేసులు ఉన్నప్పుడే ఢిల్లీకి వస్తారని జేసీ అన్నారు.

జగన్ రాష్ట్రపతిని కలవడంపై కూడా జేసీ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రపతిని కలిస్తే ఆయన ఏం చేస్తారని, కప్పు కాఫీ ఇచ్చి, పరిశీలిస్తామని సమాధానం చెప్పడం తప్ప మరేమీ హామీ లభించదని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రిదే అసలు పాత్ర అని చెప్పారు. అనవసరంగా విమాన టిక్కెట్లకు డబ్బులు వృథా చేయకుండా రామ్ జెఠ్మలానీ వంటి లాయర్లను పెట్టుకొని ఆ మార్గంలో చూసుకోవాలన్నారు.

మరో సూట్‌కేసు కంపెనీ వ్యవహారం..

మరో సూట్‌కేసు కంపెనీ వ్యవహారం..

ఈ మధ్యనే మరో సూట్ కేసు వ్యవహారం బయటపడింది కాబట్టి ఇక లాభం లేదు అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు, ప్రభుత్వంలో మంత్రులు కావడం అనేది అలవాడుగా మారిందని, పార్లమెంటు సంప్రదాయాల తరహాలో ఇది కూడా సంప్రదాయం అయిందన్నారు.

కాలంతో పాటు పద్ధతులు మారుతాయి.. జగన్ మూర్ఖత్వం వల్లే

కాలంతో పాటు పద్ధతులు మారుతాయి.. జగన్ మూర్ఖత్వం వల్లే

కాలం మారుతోందని, పద్ధతులు మారుతాయని, జగన్ మాత్రం మారనని అంటే కొట్టుకు పోతారన్నారు. చంద్రబాబు వైసిపి ఎమ్మెల్యేలను పిలువలేదని, జగన్ మార్ఖత్వాన్ని సహించలేకే టిడిపిలో చేరారని చెప్పారు. ఆయన నాయకత్వంపై విసిగిపోయారన్నారు. అందుకే బంధువులు, సీనియర్లు పార్టీని వీడుతున్నారని చెప్పారు.

రాత్రుళ్లు జగన్ దందా!

రాత్రుళ్లు జగన్ దందా!

జగన్ నాయకత్వంపై వ్యతిరేకతతోనే వైసిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడారని నిమ్మల కిష్టప్ప అన్నారు. తన భార్య గతంలో అనంతపురం జెడ్పీ చైర్ పర్సన్ కావలసి ఉండగా, నాడు వైయస్ రాజశేఖర రెడ్డి టిడిపి జెడ్పీటీసీలను కాంగ్రెస్‌లోకి లాక్కొని అడ్డుపడ్డారన్నారు.

జగన్ సొంత సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వచ్చారని, రాత్రిళ్లు దందాలు చేసుకుంటూ పగలు భేటీ అవుతారని ఆరోపించారు. రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన వైయస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారని అవంతి శ్రీనివాస్ అన్నారు.

English summary
Telugudesam Party leader and MP JC Diwakar Reddy revealed why YSR Congress Party chief YS Jaganmohan Reddy touring in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X