వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోగాపురం ఎఫెక్ట్: ఎయిర్‌పోర్టు వద్దని రైతులు, ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవగరం: ఏపీలోని భోగాపురం కలెక్టరేట్ వద్ద సోమవారంనాడు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమకు భోగాపురంలో విమానాశ్రయం అవసరం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భోగాపురం గ్రామస్థులు, మండలానికి చెందిన వారు పాల్గొన్నారు.

వారు కలెక్టరేట్‌ను ముట్టడించి, లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కనిపించింది. భారీగా మోహరించిన పోలీసులు రైతులు లోపలకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విజయనగరం మొత్తం ఖాకీమయంగా మారింది.

Bhogapuram people say no to Airport

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. భోగాపురం వద్ద తమకు విమానాశ్రయం అవసరం లేదని చెప్పారు. మా భూమి కొనుక్కొని, మాకే ముష్టి వేసినట్లుగా రెండు వందల గజాలు, అయిదువందల గజాలు, వెయ్యి గజాలు ఇస్తే ఎలా అన్నారు. తమకు విమానాశ్రయమే అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులు 'బలవంతంగా మా భూములు లాక్కుంటే సహించేది లేదు' అనే ప్లకార్డులు ప్రదర్శించారు.

ఏనుగుల సంచారం: భయాందోళనలో గ్రామస్తులు

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలం జమ్మాదివలసలో ఆదివారం రాత్రి నుంచి ఏనుగుల సంచారం ఎక్కువైంది. అడవి నుంచి భారీగా తరలివచ్చిన ఏనుగుల మంద గ్రామంలో తిరుగుతూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.

English summary
Bhogapuram Mandal and village people say n to Airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X