వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ తర్వాత ఆళ్లగడ్డపై దృష్టి: కేసులు పెడతామని అఖిలప్రియ హెచ్చరిక

నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గం పైన పూర్తిగా దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అఖిలప్రియ మంగళవారం తెలిపారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గం పైన పూర్తిగా దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అఖిలప్రియ మంగళవారం తెలిపారు. ఆమె బాచేపల్లిలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అడ్డుపడితే..

అడ్డుపడితే..

ఈ సందర్భంగా మాట్లాడారు. అభివృద్ధి పనులకు అడ్డుపడితే సహించేది లేదని విపక్షాలను హెచ్చరించారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్డుల నిర్మాణం త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Recommended Video

YS Jagan Shock To Bhuma Akhila Priya
భోజనాలు ఏర్పాటు చేసి..

భోజనాలు ఏర్పాటు చేసి..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పింఛన్లు మంజూరు చేయనున్నారని వీటిని త్వరలోనే ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేసి అందచేస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి అడ్డు తగిలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.

కేసులు పెడతామని హెచ్చరిక

కేసులు పెడతామని హెచ్చరిక

ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టించి అయినా సరే అభివృద్ధి చేస్తామని చెప్పారు. నంద్యాల ఉపఎన్నిక ఉందని, దాని తర్వాత తాను పూర్తిగా ఆళ్లగడ్డపై దృష్టి పెడతానని చెప్పారు. సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

 కార్యక్రమంలో అఖిలప్రియ సోదరి కూడా

కార్యక్రమంలో అఖిలప్రియ సోదరి కూడా

కాగా, గ్రామస్థులు అఖిలప్రియకు సమస్యలను చెప్పారు. ఒక నెలలోపు సమస్యలన్నింటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూమా మౌనిక కూడా పాల్గొన్నారు.

English summary
Andhra Pradesh TDP leader and Minister Bhuma Akhila Priya on Tuesday said that she will concentrate on Allagadda after Nandyal by elections. She promised villagers that she will solve all problems within the month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X