వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిలాంటి వాళ్లు వెల్‌లో ఉండగానే..: రాష్ట్ర విభజనపై జైపాల్ రెడ్డికి ఉండవల్లి సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమహేంద్రవరం: రాష్ట్ర విభజనపై తాను రాసిన పుస్తకం కట్టుకథ అంటూ కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెసు నాయకుడు ఎస్. జైపాల్‌రెడ్డి చేసిన విమర్శలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విరుచుకుపడ్డారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తన ఆత్మకథలో లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందలేదని రాసిన విషయంపై జైపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దానిపై ఉండవల్లి తీవ్రంగా ప్రతిస్పందించారు

తనది కట్టుకథేనని, తాను ఊహించి రాసిందేనని, విశ్లేషణ మాత్రమేనని, నాడు స్పీకర్‌ చాంబర్‌లో సుష్మాస్వరాజ్‌, కమలనాథ్‌ మధ్య రాజీ కుదిర్చానని మీరే చెప్పా రని, అసలు లోపల ఏంజరిగింది? ఇప్పటికైనా జైపాల్ రెడ్డి నిజాలు చెప్పాలని ఆయన అన్నారు.

Undavalli Arun Kumar

నిజాలు చెప్తే ప్రజలకు కాస్తయినా ఉపశమనం కలుగుతుందని ఆయన అన్నారు. అప్పట్లో.. స్పీకర్‌ చాంబర్‌లో జరిగింది చెబితే ఎన్నికల్లో ఓడిపోయేవాడిని కానని ఆయన అన్నారు. ఆరోజు చొరవ తీసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారని జైపాల్ రెడ్డి అంటున్నారని ఆయన చెప్పారు.

పైగా కొంతవరకైనా రాజ్యాంగ మర్యాదలు పాటించానని జైపాల్ రెడ్డి చెబుతున్నారని, అంటే.. లోపల జరిగిన విషయాన్ని బయటకు చెప్పలేకపోయారంటే అక్కడ కుట్ర జరిగిందనీ అనర్థం జరిగిందని ఉండవల్లి అన్నారు. అందుకే మీరు బయటకు చెప్పలేకపోయారని ఉండవల్లి విమర్శించారు.

లోక్‌సభలో ఓటింగ్‌కు పట్టుబడితే, వెల్‌లో సభ్యులుండగా ఓటింగ్‌ కుదరజని చెప్పి, రాజ్యసభలో చిరంజీవి వంటి నేతలంతా వెల్‌లో ఉండగానే ఓటింగ్‌ ఎలా నిర్వహించారని ఉండవల్లి ప్రశ్నించారు. లోక్‌సభకో రూల్‌, రాజ్యసభకో రూల్‌ లేదు కదా! అని ఆయన అన్నారు.

తన నా వాదన ఒకటేనని, విభజన బిల్లు పాసవ్వలేదని, ఓటింగ్‌ జరగలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా మెజారిటీ లేదని, ఏం చేయాలో అర్థంకాని సమయంలో ఓటింగ్‌ లేదు ఏమీ లేదని జైపాల్‌ సలహా ఇచ్చారని ఆయన అన్నారు. అంతకుమించి ఆయన చేయడానికి అక్కడ ఏముందని ఆయన అన్నారు.

బీజేపీ అడ్డుకోవడానికి సిద్ధంగా లేదని ఆయన అన్నారు. జైపాల్‌ రెడ్డి ఆయనకు రాజ్యాంగంపట్ల ఉన్న అంకితభావాన్ని అభిమానాన్ని ప్రజల ముందు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో అసలేం జరిగిందో చెప్పాలని అడిగారు. కేసీఆర్‌ చనిపోయేటట్టు ఉన్నాడని చెప్పకపోతే తెలంగాణ వచ్చేదికాదని ప్రకటించారని అన్నారు. అలాగే ఇప్పుడూ చెప్పాలని, లేదంటే రాజ్యాంగ విరుద్ధ సలహా ఇచ్చానని, ధర్మం చెప్పనని అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. సెంటిమెంట్‌తో తప్పుడు సలహా ఇచ్చానంటే విలువ పెరుగుతుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

English summary
Ex MP Undavalli Arun Kumar challenged Telangana Congress leader S Jaipal Reddy on the Andhra Pradesh reorganisation bill passed in Loksabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X