వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన నష్టం ఇంకా తెలిసొస్తుంది: అశోక్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bifurcation problems will not end: Ashok babu
విజయవాడ: రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం ఏమిటో రానున్న రోజుల్లో మరింతగా తెలిసివస్తుందని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు అన్నారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడ ఎన్జీవో హోమ్‌లో తాలూకా శాఖ భవనం మొదటి అంతస్థుపై నిర్మించిన కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర విభజన జరిగి 6 నెలలైనా పాలనా వ్యవస్థ మాత్రం 50 శాతమే కుదుటపడిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ప్రకటించిన ప్రాంతంలోనే పాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన యంత్రాంగాన్ని హైదరాబాద్ నుండి తరలించాలని అశోక్‌బాబు సూచించారు. ఉద్యోగుల పీఆర్సీ, హెల్త్‌కార్డుల సమస్యల పరిష్కారానికి సంఘం మరింతగా కృషి చేస్తుందని చెప్పారు. ఆర్థిక వెసులుబాటును బట్టి వరస క్రమంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.

ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు రాజకీయ ప్రతిష్ఠగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయనన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకే ప్రాతిపదికన పీఆర్సీని అమలుచేయాలని కోరినా అంగీకరించడం లేదన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ చట్టప్రకారం రెగ్యులరైజ్ చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్నారు.

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపునకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని), ఆర్డీవో ఎస్ వెంకటసుబ్బయ్య, అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎన్ చంద్రశేఖరరెడ్డి, ఎ విద్యాసాగర్, ఉల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను అశోక్ బాబు నేతృత్వంలో ఆంధ్ర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.

English summary
AP NGOs president Ashok Babu said that there will be no end to the problems created by the bifurcation of United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X