గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి...టిడిపి మద్య దూరం...గుంటూరులో ఒంటరి పోరుకు బిజెపి సై

By Narsimha
|
Google Oneindia TeluguNews

2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జట్టు కట్టి పోటీ చేసిన తెలుగుదేశం , బిజెపిల మద్య ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల్లో కొంత అంతరం కన్పిస్తోంది. టిడిపి అధికారంలో ఉన్న ఎపిలో నామినేటేడ్ పదవుల విషయంోనూ ఇతరత్రా వ్యవహారాల్లో టిడిపి వైఖరి పట్ల బిజెపి అసంతృప్తితో ఉంది.ఆ పార్టీ పాలన పట్ట కొందరు బిజెపి నాయకులు అప్పుడప్పుడూ బహిరంగంగానే విమర్శలు చేశారు.తెలంగాణలో ఈ రెండు పార్టీలు అంటీముట్టనట్టే వ్యవహారిస్తున్నాయి.

ఎపిలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపితో పొత్తున్నా....తమ సత్తా చూపాలంటే ఒంటరిగా పోటీచేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. .గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించినట్టు నగర పార్టీ ప్రకటించింది నామినేటేడ్ పదవుల భర్తీ విషయంలో అధికార పార్టీ వ్యవహారిస్తోన్న తీరు పట్ల బిజెపి నాయకులకు మింగుడు పండడం లేదు.

Bjp unhappy about tdp attitude

గత నెలలో నామినేటేడ్ పదవులను అధికార పార్టీ భర్తీ చేసింది.ఈ పదవుల్లో బిజెపికి ఒక్క స్థానం కూడ దక్కలేదు. దేవాలయ కమిటీల్లో మినహా ఎక్కడ కూడ బిజెపికి ఆశించిన మేర ప్రయోజనం దక్కలేదు.దీంతో టిడిపికి తగినబుద్ది చెప్పాలని బిజెపి నాయకులు రగిలిపోతున్నారు.

త్వరలో గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో ఓంటరిగా పోీచేయాలని బిజెపి భావిస్తున్నట్టు ఆ పార్టీ నగర అధ్యక్షుడు ప్రకటించారు.52 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.పొత్తున్నా తమ అభ్యర్థులు బరిలో ఉంటారని బిజెపి నాయకత్వం ప్రకటించింది.ఈ ప్రకటనతో టిడిపి నాయకులు బిజెపి వైఖరి పట్ల ఖంగుతిన్నారు. బిజెపి నాయకులను బుజ్జగించే పనిలో పడ్డారు.

English summary
Bjp angry about tdp leadership attitude in Andhra pradesh. Tdp filled nominated posts ..there is noone bjp candidate.from the begining tdp leaders ignore bjp..So bjp decided to contest in Guntur corporation election without tdp.bjp contest 52 divisions in Gumtur corporation announced bjp guntur town president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X