హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు సీజ్: ఐదుగురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి జరుపుతున్న ఈ తనిఖీల్లో పోలీసులు పేలుడుకు ఉపయోగపడే పదార్థాలను భారీస్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నైట్రో గ్లిజరిన్, అమ్మోనియా, డిటోనేటర్లు ఉన్నాయి.

ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు పట్టుబడ్డ వ్యక్తుల నుంచి సమాచార సేకరణకు విచారణ చేపట్టారు.

blast material seized in rajendra nagar, hyderabad

పసికందు అనుమానాస్పద మృతి

సికింద్రాబాద్‌కు సమీపంలోని బౌద్ధ నగర్‌లో ఐదు నెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే చిన్నారి తల్లి కనిపించడం లేదు. చిన్నారిని తల్లే చంపి పారిపోయి ఉంటుందని కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. చిన్నారి బంధువులు కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జె.పొంగులూరు మండలం ముప్పవరంలో ఆగివున్న ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

English summary
Blast material seized by Hyderabad Police at rajendra nagar on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X