వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపికి, పదవికి సత్యవతి రాథోడ్ రాజీనామా: తెరాసలోకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Satyavathi Rathod to join TRS
హైదరాబాద్/వరంగల్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, శాసన మండలి సభ్యులు నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరగా... ఆ బాటలోనే మరికొందరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కూడా కారెక్కనున్నారు. ఆమె ఆదివారం టిడిపికి రాజీనామా చేశారు.

2009 ఎన్నికల్లో సత్యవతి రాథోడ్ వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆమె తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లనున్నారు. తన అనుచరులతో ఈ విషయమై ఆమె సమావేశాలు నిర్వహించారు. ఆమె రాకను తెరాస స్థానిక నేతలు ఆహ్వానిస్తున్నారు. మరోవైపు కొందరు టిడిపి నేతలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆమె ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అందుకు కెసిఆర్ కూడా అంగీకరించడమే కాకుండా టిక్కెట్ పైన హామీ కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో ఆమె తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తి నచ్చినందువల్లే

ఆదివారం సత్యవతి రాథోడ్ తన నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ... కెసిఆర్ ఉద్యమ స్ఫూర్తి నచ్చినందువల్లే, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తాను తెరాసలో చేరుతున్నానని ఆమె చెప్పారు. తాను రేపు తెరాసలో చేరనున్నట్లు చెప్పారు.

మరోవైపు బోథ్ ఎమ్మెల్యే నగేష్ కూడా కారెక్కనున్నారు. తాను పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం చేరుతున్నానని నగేష్ చెప్పారు. కాగా, సత్యవతి రాథోడ్, నగేష్‌లు మూడో తారీఖున కెసిఆర్ సమక్షంలో కారెక్కనున్నారు.

English summary
In a blow to the Telugudesam Party, an exodus of its Telangana leaders into the TRS has begun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X