వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ తర్వాతే: ముద్రగడకు బోండా షాక్, కాపు రిజర్వేషన్లపై రివర్స్!

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాపు రిజర్వేషన్ల పైన చంద్రబాబు ప్రభుత్వం వేసిన కమిషన్‌కు మరో పది రోజుల్లో గడువు ముగియనుంది. అదే సమయంలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

రివర్స్, పోటాపోటీ: పవన్ కళ్యాణ్‌తో కలిసేందుకు జగన్ సై, వ్యూహమా?

ఈ నేపథ్యంలో టిడిపి నేత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు సోమవారం నాడు ముద్రగడ పైన నిప్పులు చెరిగారు. అదే సమయంలో ఆయన వ్యాఖ్యల్లో ఒకింత వెనుకడుగు కనిపించింది. డెడ్ లైన్లతో రిజర్వేషన్లు రావని ఆయన ధ్వజమెత్తారు.

Bonda Uma shocking comments on Kapu Reservation issue

కాపు రిజర్వేషన్ల పైన వేసిన కమిషన్ గడువు త్వరలో ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో డెడ్ లైన్లతో రిజర్వేషన్లు రావని బోండా ఉమ చెప్పడం గమనార్హం.

బోండా ఉమ ఇంకా మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక అభివృద్ధి కోసం ఒక్క లేఖ రాయలేదన్నారు.

కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. పల్స్ సర్వే నివేదికలు అందాక రిజర్వేషన్ల పైన ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాపులకు వెయ్యి కోట్లు ఇచ్చిన ఘనత తమదే అన్నారు.

English summary
Telugudesam Party MLA Bonda Uma shocking comments on Kapu Reservation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X