వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఇదీ జీఎస్టీ పరిస్థితి..బెజవాడలో స్తంభించిన బిజినెస్

ఎన్డీయే మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూరుతుందని ప్రధాని మోదీతోపాటు అధికార బీజేపీ నేతలు, టీడీపీ నేతలు చెప్తున్నారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఎన్డీయే మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూరుతుందని ప్రధాని మోదీతోపాటు అధికార బీజేపీ నేతలు, టీడీపీ నేతలు చెప్తున్నారు.

<strong>మోడీ 'ఒక్క' దెబ్బకు లక్ష కంపెనీలు రద్దు, 37వేలు బోగస్‌వి</strong>మోడీ 'ఒక్క' దెబ్బకు లక్ష కంపెనీలు రద్దు, 37వేలు బోగస్‌వి

జీఎస్టీ పన్ను శాతాల్లో తేడాలు, అస్పష్ట పరిస్థితుల మధ్య విజయవాడ నగరంలో సాధారణంగా కోట్ల రూపాయల్లో సాగిన వ్యాపారం ఒక్కరోజులో పడిపోయింది. శుక్రవారం వరకు కిటకిటలాడిన దుకాణాలు.. మరుసటి రోజు బోసిపోయాయి. వస్తువులను కొనుగోలు చేసే వారి కంటే, వాటి ధరలు తెలుసుకునే వారే ఎక్కువగా కనిపించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలిరోజు విజయవాడలోని మార్కెట్‌ తీరిదీ.

విజయవాడలోనే ఒక్క బంగారంపైనే రోజుకు రూ.15 కోట్ల వ్యాపారం సాగుతోంది. ఇది కాకుండా మిగిలిన వ్యాపారాలన్నీ కలిపితే రూ.45-50 కోట్ల వరకు ఉంటుంది. రాజధానిలో భాగమయ్యాక నగరంలో వ్యాపారం మరింత పెరిగింది. పెద్ద నోట్ల రద్దుతో బంగారం, ఎలక్ట్రానిక్‌, వస్త్రవ్యాపారంపై విపరీతమైన ప్రభావం పడింది. ఇప్పుడు జీఎస్టీ రాకతో అదే పరిస్థితి పునరావృతమైందని అంటున్నారు.

మారిన ‘పట్టిక'

మారిన ‘పట్టిక'

జీఎస్టీ రాకతో బిల్లుల రూపురేఖలు మారాయి. కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్లు, బిల్లుల్లోని పట్టికలు మారుతున్నాయి. శనివారంనాటి విక్రయాల‌పై జారీ చేసిన బిల్లుల్లో చాలా దుకాణాలు జీఎస్టీని స్పష్టంగా చూపాయి. ఇంతకుముందు ఇచ్చిన బిల్లులో వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాన్ని వేరుగా చూపించేవారు. ఇప్పడు ఆ రెండు పట్టికలను తొలగించి జీఎస్టీని చూపిస్తున్నారు. ఎలకా్ట్రనిక్‌ వస్తువుల షాపులు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకునే పనిలో ఉన్నాయి. శనివారం నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినా కొన్ని వ్యాపార సంస్థలు ఇంకా పాత ధరలతోనే అమ్మకాలు సాగించాయి. కాగా, రూపాయి చెల్లించి వాషింగ్‌మెషీన్‌, ఎయిర్‌ కూలర్‌ తీసుకెళ్లమన్నా.. ఖరీదైన కారును బహుమతిగా పొందమన్నా... ఇంకా చాలా వరకు సరుకు షాపుల్లో మిగిలిపోయింది. మిగిలిన గ్రౌండ్‌ స్టాక్‌పై 60శాతం నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. నష్టమేనని వ్యాపారులు అంటున్నారు.

వినియోగదారుల్లో ఆందోళన..

వినియోగదారుల్లో ఆందోళన..

వ్యాపారంపై జీఎస్టీ ప్రభావం పడింది. ధరలు పెరిగిపోతాయన్న ఆందోళన వినియోగదారుల్లో కనిపిస్తోంది. జీఎస్టీతో ఎలకా్ట్రనిక్‌ వస్తువులపై పెద్దగా ధరలు పెరగలేదు. రెండు శాతమే పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి పట్టిక వచ్చే వరకు వేచి చూస్తామని వస్త్ర వ్యాపారులు.. అప్పటిదాక పాత ధరలకే వస్త్రాలు విక్రయి్తామని తెలిపారు. ప్రభుత్వం విధించే పన్ను తామే భరిస్తామని వస్త్ర వ్యాపారులు అంటున్నారు.

ఆరు నెలల సమయం పడుతుందన్న ఫ్యాప్సీ

ఆరు నెలల సమయం పడుతుందన్న ఫ్యాప్సీ

ఆదాయపు పన్ను దాఖలు చేసే విషయంలో వ్యాపార, వాణిజ్య సంస్థల పట్ల ప్రభుత్వం ఓ ఏడాదిపాటు ఉదాసీనంగా ఉండాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) అభిప్రాయపడింది. తొలిసారిగా జీఎస్‌టీని అమలు చేస్తుండడమే ఇందుకు కారణమని ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌ రవీంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పన్ను వివిధ శ్లాబుల్లో ఉన్నందున వన్‌ నేషన్‌- వన్‌ ట్యాక్స్‌కు బదులుగా వన్‌ కమోడిటీ-వన్‌ ట్యాక్స్‌ అని పిలవాలన్నారు. జీఎస్‌టీని అర్థం చేసుకోవడానికి వ్యాపారులకు కనీసం ఆరు నెలలైన సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

పూర్తిస్థాయిలో జీఎస్టీ అమలు చేశాకే స్పష్టత

పూర్తిస్థాయిలో జీఎస్టీ అమలు చేశాకే స్పష్టత

‘ఎన్నో అంశాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొందరు ప్రభుత్వ అధికారులకే వీటిపై స్పష్టత లేదు. జీఎస్‌టీ అమలు చేయటమనేది భారత దేశ చరిత్రలో చారిత్రక ఘట్టం. స్వాతంత్య్రం అనంతరం తీసుకున్న సాహసోపేత సంస్కరణల్లో ఇదొకటి. కాకపోతే కొన్ని అంశాల్లో స్పష్టత అవసరం. జీఎస్‌టీ అమలైతేనే వీటిని అర్థం చేసుకోగలం. చాలా మంది వర్తకులు, సేవలందించే వారు పన్ను పరిధిలోకి కొత్తగా వస్తున్నారు. పన్నులు, ఆదాయపు పన్ను దాఖలు గురించి అవగాహనకు వీరికి కొంత సమయం పడుతుంది. కాబట్టి చిన్న వర్తకులు నూతన వ్యవస్థను అర్థం చేసుకునే వరకు ప్రభుత్వం ఏడాదిపాటు ఉదాసీనంగా వ్యవహరించాలి' అన్నారు. ఉదాహరణకు స్వీట్లు 5%, కన్ఫెక్షనరీ 18% పన్ను పరిధిలో ఉన్నాయి. అయితే కొన్ని ఉత్పాదనలు ఏ విభాగం కిందకు వస్తాయోననే సంశయం ఉందన్నారు.

English summary
Business had paralysed in Vijayawada City with GST effect while consumers are many peaple particularly house hold items. Fapsi AP president Ravindra Modi said that Six months for clariffications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X