వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్‌ను కలిసిన జగన్ పార్టీ ఎంపి రేణుక, 'జగన్‌కు తొందరెక్కువ'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం నాడు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. తాను కొడుమూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి లోకేష్‌ను కలిసినట్లు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక శుక్రవారం నాడు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. తాను కొడుమూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి పరిష్కారానికి లోకేష్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయం లక్ష్యం

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆదాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనలో అన్నారు. రాయలసీమను ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా చేస్తామన్నారు.

టిడిపిలో చేరినందుకు గర్వంగా ఉంది: అఖిల, వైసిపి సర్పంచ్‌లు రాలేదు: లోకేష్టిడిపిలో చేరినందుకు గర్వంగా ఉంది: అఖిల, వైసిపి సర్పంచ్‌లు రాలేదు: లోకేష్

Butta Renuke meets YS Jagan

సురక్షిత తాగునీటి కోసం రూ.15 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సర్పంచులు పంచాయతీ నిధులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు.

లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మొక్కలను నాటాలని, లేకపోతే బిల్లులను మంజూరు చేయమన్నారు. మూడు నెలల్లో కర్నూలు జిల్లాలో నాలుగైదు ప్రముఖ కంపెనీలను ఏర్పాటు చేస్తామన్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu

జగన్‌కు తొందర ఎక్కువ: రాయపాటి

జగన్‌కు తొందర ఎక్కువైందని టిడిపి ఎంపి రాయపాటి సాంబశివ రావు వేరుగా అన్నారు. లాలూ వంటి వాళ్లే కేసుల నుంచి తప్పించుకోలేక పోతున్నారని, ఇక జగన్ లాంటి అవినీతిపరులను కేంద్రం చేరదీస్తుందా అని ప్రశ్నించారు. కేంద్రం వదలదన్నారు.

జగన్‌కు తొందర ఎక్కువైందని, ఇప్పుడే హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రైల్వే జోన్ విషయంలో తాను చెప్పింది ఎంపీలు అర్థం చేసుకోవడం లేదన్నారు.

ఏపీలో నియోజకవర్గాల పెంపు ఖాయమని రాయపాటి చెప్పారు. జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు అమరావతిలో జరగడం శుభ పరిణామం అని చెప్పారు. నాగార్జున వర్సిటీలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు తానే కృషి చేశానన్నారు.

English summary
YSR Congress Party MP Butta Renuka on Friday met Telugu Desam Party leader and Minister Nara Lokesh regarding consitituency issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X