నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలపై సీఈసీ సీరియస్: తక్షణ చర్యలకు ఆదేశం

వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తీవ్రంగా స్పందించింది. చంద్రబాబుపై జగన్‌ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని సీఈసీ స్పష్టం చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తీవ్రంగా స్పందించింది. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని సీఈసీ స్పష్టం చేసింది.

జగన్‌పై చర్యలకు ఆదేశం

జగన్‌పై చర్యలకు ఆదేశం

జగన్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా వైయస్‌ జగన్‌ దాదాపు 13రోజుల పాటు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
అనుచిత వ్యాఖ్యలు

అనుచిత వ్యాఖ్యలు

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తూ ‘ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలి.. ఉరి తీయాలి.. చెప్పుతో కొట్టాలి.. కాలర్ పట్టుకోవాలి' అంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు.

ఫిర్యాదు..

ఫిర్యాదు..

దీనిపై టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్ర ఈసీ పట్టించుకోకపోవడంతో టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప తదితరులు కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి ఫిర్యాదు చేశారు.

సీఈసీ సీరియస్

సీఈసీ సీరియస్

ఈ అంశాన్ని పరిశీలించిన సీఈసీ జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని పేర్కొంంది. అంతేగాక, వెంటనే జగన్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులను ఆదేశించింది. సీఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
CEC ordered to take action against YSR Congress Party president YS Jaganmohan Reddy for abusive comments on Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X