విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుధుద్: విశాఖలో కేంద్ర బృందం పరిశీలన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హుధుద్ తుఫాను వల్ల ఏర్పడిన నష్టం, పనుల పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను మూడు రోజుల్లోగా తమకు అందజేయాలని నాలుగు జిల్లాల కలెక్టర్లను కేంద్ర బృందం కోరింది. తుఫాను నష్టం అంచనాకు కేంద్రం నియమించిన తొమ్మిది మంది సభ్యుల బృందం మంగళవారం విశాఖలో పర్యటించింది. విశాఖ కలెక్టరేట్‌లో హుధుద్ తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను బృందం తిలకించింది.

హుధుద్ తుఫానును ఎలా ఎదుర్కొన్నారనే అంశంపై బ్లూ బుక్ రాస్తే బాగుంటుందని విశాఖపట్నం కలెక్టర్ డాక్టర్ యువరాజ్‌ను బృందం కోరింది. తుఫాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొన్నారు.. సమష్టిగా పనిచేసి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలను బ్లూ బుక్‌గా తెస్తే అది ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ బృందంలో ఎం రమేష్‌కుమార్, రాజీబ్ కుమార్ సేన్, వివేక్ గోయల్, కెకె పాదక్, ఎస్‌ఎం కొల్‌హత్‌కుమార్, ఆర్‌పి సింగ్, ఎస్.బ్రిజేష్ శ్రీవాత్సవ్‌లు ఉన్నారు.

ఈ సమావేశంలో విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు ఎంఎం నాయక్, గౌరవ్ ఉప్పల్, నీతూప్రసాద్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, వ్యవసాయశాఖ కమిషనర్ కె మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.

తుఫాను నష్టం అంచనా వేయడంలో రాజకీయాలకు తావు లేదని కేంద్ర బృందం సభ్యుడు వివేక్ గోయల్ స్పష్టం చేశారు. హుధుద్ తుఫాను విశాఖలో విధ్వంసాన్ని సృష్టించిన మరుక్షణమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో పర్యటించారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను అంచనావేసి నష్టంపై కేంద్రానికి నివేదికలు ఇస్తామని వెల్లడించారు. కెకె పాఠక్ నేతృత్వంలోని కేంద్ర బృందం తొలుత హుధుద్ తాకిడికి చిన్నాభిన్నమైన విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించింది.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

హుధుద్ తుఫాను వల్ల ఏర్పడిన నష్టం, పనుల పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను మూడు రోజుల్లోగా తమకు అందజేయాలని నాలుగు జిల్లాల కలెక్టర్లను కేంద్ర బృందం కోరింది.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

తుఫాను నష్టం అంచనాకు కేంద్రం నియమించిన తొమ్మిది మంది సభ్యుల బృందం మంగళవారం విశాఖలో పర్యటించింది.

కేంద్రం బృందం

కేంద్రం బృందం

విశాఖ కలెక్టరేట్‌లో హుధుద్ తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను బృందం తిలకించింది.

కేంద్రం బృందం

కేంద్రం బృందం

హుధుద్ వల్ల జిల్లాకు వాటిల్లిన నష్టంపై కలెక్టర్ యువరాజ్ బృందానికి వివరించారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న కేంద్ర బృందాన్ని ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో అడ్డుకునేందుకు యత్నించారు. 45 రోజులు దాటిన తర్వాత హుదూద్ నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రావడంపై మండిపడ్డారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

తాగునీరు, రోడ్లు, పంటలు, తీర ప్రాంత మత్స్యకారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు ఏమేరకు నష్టం వాటిల్లిందీ.. ఏ విధంగా వారిని ఆదుకున్నదీ కలెక్టర్ తెలిపారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

ఏపిఇపిడిసిఎల్‌కు ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది ఆ సంస్థ సిఎండి శేషగిరిబాబు వివరించారు.

కేంద్ర బృందం

కేంద్ర బృందం

అనంతరం బృందం సభ్యులు మాట్లాడుతూ.. తుఫాను వల్ల ఏర్పడిన నష్టాలపై నివేదికను అందజేశారే తప్ప, ఏ మేరకు పనులు పునరుద్ధరించారు.. ఇంకా ఏ మేరకు నిధులు అవసరం అన్న విషయాలపై నివేదికలో పేర్కొనకపోవడాన్ని తప్పుబట్టారు.

English summary
A nine-member central committee to assess Hudhud losses in the region has arrived in Visakhapatnam. The committee will tour Srikakulam, Vizianagaram, Visakhapatnam and East Godavari districts to assess the losses caused by Hudhud cyclone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X