వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదాపై ఆడిగా, నిర్ణయం తీసుకుంటామని మోడీ చెప్పారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై నీతిఆయోగ్‌ నివేదిక అందిందని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నట్లు చంద్రబాబు తెలిపారు.విభజన హామీల్లో ఉన్న సెంట్రల్‌ యూనివర్శిటీ, గిరిజన వర్శిటీ, కడపలో స్టీల్‌ ప్లాంట్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రోరైల్‌, విశాఖ ప్రత్యేక రైల్వేజోన్‌ నెరవేరాల్సి ఉందన్నారు. ఉపాధిహామీ పనిదినాలను కూడా పెంచాలని కోరినట్లు చెప్పారు.

ఏపీలో రైల్వేలైన్లపై రైల్వేశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి, కాకినాడ-పిఠాపురం, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్లను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. రైల్వే యూనివర్శిటీ, అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.

రాష్ట్ర విభజన సమస్యలు కొన్ని పరిష్కారమయ్యాయి, మరికొన్ని పరిష్కారం కావాల్సి ఉన్నాయని ఆయన చెప్పారు. విభజన సందర్భంగా ఎపికి చట్టంలో కల్పించిన రాయితీలను, ప్రోత్సహకాలను ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏమేమి రావాలో ఆయన వివరించారు.

ఎపి 16.078 వేల కోట్ల లోటుతో ఉంటుందని తేల్చారని, దాన్ని భర్తీ చేస్తామని విభజన సందర్భంగా హామీ ఇచ్చారని, ఇందులో 2,300 కోట్లు ఇచ్చారని, ఇంకా 13 వేల కోట్ల పైచిలుకు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆ విషయాన్ని తాను ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరులకు ప్రత్యేక గ్రాంట్ కింద వేయి కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు.

Chandarababu says he requested PM for special package to AP

రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అప్పుడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దాని కింద 200 కోట్ల రూపాయలేసి ఇవ్వాలని అడిగానని చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతికి 2016-17లో 4 వేల కోట్లు ఇవ్వాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు. 2018 -19లో కూడా ఎపి లోటులో ఉంటుందని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.

కరువు పీడిత జిల్లాలో ఉపాధి హామీ కింద పనిదినాలను పెంచాలని కోరానని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివద్ధికి ప్రోత్సహకాలు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తాము ఖర్చు చేసిన 2.560 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that he requested PM narendr Modi announce special package to AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X