వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబినెట్‌తో ముప్పు: ముప్పేట దాడితో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి

మంత్రివర్గ పునర్వ్యస్థీకరణతో చంద్రబాబు ముప్పేట దాడిని ఎదుర్కుంటున్నారు. అన్ని వైపుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, దాని అధినేత - రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని ఒత్తిడికి గురవుతున్నారు. ఇటు అధికార టీడీపీలో అసమ్మతికి హేతువుగా మారిన కేబినెట్ విస్తరణ ఏపీతోపాటు జాతీయ స్థాయిలో వేడి పుట్టిస్తున్నది.

మంత్రి పదవుల ఆశజూపి తన వారిని ఆకర్షించారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ విమర్శలు చేయడంతోపాటు జాతీయ స్థాయిలో టీడీపీని అప్రతిష్ట పాల్జేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఏళ్ల తరబడి సేవ చేస్తే తమను కాదని వైరి పక్షం.. ఇప్పటి వరకు పోరాటం జరిపిన వారిని పిలిచి అందలం ఎక్కించడమేమిటని కొందరు తెలుగు తమ్ముళ్లు కినుక వహిస్తున్నారు. తొలి నుంచి.. అందునా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నవారు తమ మర్యాదలేం కావాలని మరికొందరు సీనియర్లు మండిపడ్తున్నారు.

పార్టీ ఫిరాయింపుల చట్టానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం వల్ల మిత్రపక్షంగా మన పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని.. అప్రతిష్టను మంకిలం అంటుందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీలకు పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి బహిరంగ లేఖాస్త్రం సంధించారు.

వారసత్వ రాజకీయం దిశగా చంద్రబాబు

వారసత్వ రాజకీయం దిశగా చంద్రబాబు

జాతీయ పార్టీ కాంగ్రెస్‌తోపాటు దేశంలోని ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే తెలుగుదేశాధినేత చంద్రబాబు తన వారసుడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే దిశగా వ్యూహాత్మకంగా ముందడుగు వేశారు. మూడేళ్ల క్రితం తెర వెనుక రాజకీయం.. తెలంగాణ ఆవిర్బావంతో ఆంద్రావని యువతలో నెలకొన్న అసంత్రుప్తి, ద్వేషాగ్ని జ్వాలలను అనువుగా మార్చుకుని అధికార దండం చేతబట్టిన చంద్రబాబు.. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి' నిర్మాణంలో అనుచిత నిర్ణయాలతో మూడు పంటలు పండే వరిపొలాలు స్వాధీనం చేసుకుని ‘అన్నపూర్ణ' అన్న పేరుకు నానుడిగా మారిన అన్నదాతలపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చిన అపకీర్తి మూటగట్టుకున్నారని విమర్శలు ఉన్నాయి.

సకల హామీలతో 2014లో అధికారం

సకల హామీలతో 2014లో అధికారం

ఇంటింటికి ఉద్యోగం.. అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీల అమలులో వెనుకంజ వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. అనునిత్యం విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దాడిని ఎదుర్కొనలేక.. అనుభవ రహితుడైన నేత అని అవహేళన చేస్తూ దాట వేస్తూ వచ్చారు. రాష్ట్రాభివ్రుద్ధి పేరిట ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజాభీష్టానికి దూరమవుతున్నది. ఈ తరుణంలో 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేబినెట్ రూపుదిద్దుకున్నారు.

లోకేశ్‌కు శిక్షణ.. జగన్‌కు ముకుతాడు

లోకేశ్‌కు శిక్షణ.. జగన్‌కు ముకుతాడు

పనిలో పనిగా కొడుకు లోకేశ్‌కూ తన సారథ్యంలో నాయకత్వ శిక్షణ ఇవ్వబూనుకున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డికి ముకుతాడు వేసే పనిలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. ఆ క్రమంలో సాంకేతికత, నైతిక విలువలు విస్మరించారు. ఈ క్రమంలో వైరి పక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నలుగురు కీలక నాయకులకు తన క్యాబినెట్‌లో కల్పించారు. ఈ ఒరవడిలో పార్టీలోని సీనియర్లను విస్మరించారని, వారి ఆకాంక్షలను పట్టించుకున్న పాపాన పోలేదని తెలుగు తమ్ముళ్ల నిరసనల తీరు తెలియజేస్తోంది.

బొజ్జల తొలగింపు తెచ్చిన ముప్పు

బొజ్జల తొలగింపు తెచ్చిన ముప్పు

తన వ్యూహనికి పదును బెట్టే క్రమంలో తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్న బొజ్జల గోపాలక్రుష్ణారెడ్డి వంటి వారినీ కేబినెట్ నుంచి తొలగించడానికి చంద్రబాబు వెనుకాడకపోవడమే విమర్శలు తెచ్చిపెట్టింది. గోపాలక్రుష్ణారెడ్డి అనారోగ్యం సాకుగా తప్పించడమేమిటని ఆయన భార్య బ్రుందమ్మ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో బాబు దూతలు విఫలమయ్యారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే చింతమనేని ప్రభాకర్ వంటి వారు సొంత పార్టీ పెడ్తామని హెచ్చరికలూ చేశారు.

నచ్చిన వారికే...

నచ్చిన వారికే...

కీలక విధాన నిర్ణయం తీసుకోవడానికి ముందు భారీస్థాయిలో కసరత్తు సాగించే చంద్రబాబు.. తన తెలుగుదేశం పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికలూ కీలకమని కూడా తెలుసు.. తెలిసీ 2004 - 14 మధ్య కాలం వరకు పార్టీకి అండగా నిలిచిన దూళిపాళ నరేంద్ర చౌదరి.. శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత గౌతు శ్యామ్ సుందర్ శివాజీ.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్.. విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డిపై వంటికాలిపై లేచి విమర్శలు చేసిన బొండా ఉమామహేశ్వర్ రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులనూ తోసిరాజని తనకు నచ్చిన వారిని అందలం ఎక్కించారు చంద్రబాబు.

వెన్నంటి ఉన్నా నిష్ప్రయోజనమేనా?

వెన్నంటి ఉన్నా నిష్ప్రయోజనమేనా?

దానికి ప్రతిఫలమా? అన్నట్లు అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తూ ఉంటే ‘ఔరా' అంటూ క్రమశిక్షణ పేరిట హితబోధ చేసిన నేపథ్యం ఏపీ సీఎం చంద్రబాబుది. గమ్మత్తు ఏమిటంటే విపక్షంలో ఉన్నన్నాళ్లు వెన్నంటి ఉన్న దూళిపాళ నరేంద్ర చౌదరి కుమిలిపోతున్నా.. కనీసం నచ్చజెప్పేందుకు కూడా పూనుకోలేదు. చివరకు మంత్రి పదవులు అందుకున్న వారికి శాఖల కేటాయింపులోనూ ఇదే ధోరణి ప్రదర్శించారు. పార్టీకి దన్నుగా నిలిచిన పత్తిపాటికి మామూలు శాఖ కేటాయించిన వైనం కళ్లకు కడుతూనే ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిని కట్టడి చేసేందుకు రచించిన వ్యూహం ప్రతికూలంగా మారుతుందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

వ్యూహ రచనలో విఫలమైన చాతుర్యం

వ్యూహ రచనలో విఫలమైన చాతుర్యం

రెండేళ్ల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను క్యాబినెట్‌లో తీసుకునే ముందే సాంకేతికంగా జాగ్రత్త చర్యలు చేపట్టారు. సనత్‌నగర్ స్థానానికి ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజీనామా చేశాకే కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే తలసాని రాజీనామాను ఇప్పటికీ స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించకుండా సస్పెన్షన్‌లోనే ఉంచారు. అయినను నాడు తలసానికి కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టడం రాజకీయ వ్యభిచారం అని అభివర్ణించిన చంద్రబాబు.. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. తానే నీతిమంతుడినని, మిగతావారు అవినీతి పరులను ప్రచారం చేయడంలో చంద్రబాబు ముందుంటారని విమర్శలు ఉన్నాయి.

నేరుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో..

నేరుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో..

తాజాగా చంద్రబాబు తన మంత్రివర్గ విస్తరణలో బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. కానీ వారితో సాంకేతికంగానైనా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించేందుకు సాహసించలేదు. ఒకవేళ రాజీనామా చేయిస్తే.. వాటిని స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన ఆయనను వెంటాడుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ ఫిర్యాదుపై బాబు ఎదురుదాడి

జగన్ ఫిర్యాదుపై బాబు ఎదురుదాడి

తన వారి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై ఇప్పటికే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్మోహనరెడ్డి.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జాతీయ నాయకులకు ఫిర్యాదులు చేస్తుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం పట్టలేకపోయారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంపీలుగా ఆదికేశవులు నాయుడు, మందా జగన్నాథంలను 2008 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించలేదా? అని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. నల్లపునేని ప్రసన్నకుమార్ రెడ్డి తదితరుల వలసలను ప్రోత్సహించినప్పడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తేల్చాలని సవాల్ చేస్తున్నారు.

పురందేశ్వరి లేఖతో ఆత్మరక్షణలో బాబు

పురందేశ్వరి లేఖతో ఆత్మరక్షణలో బాబు

ఇదిలా ఉంటే చంద్రబాబు మిత్రపక్షం బీజేపీ నుంచి అనూహ్య రీతిలో విమర్శలు వ్యక్తం అవుతున్నారు. ప్రత్యేకించి ఆయన వ్యతిరేక వర్గంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు సన్నిహిత బంధువు - బీజేపీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి రాసిన బహిరంగ లేఖ ఇరు పార్టీల్లో ప్రకంపనలు స్రుష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల తీరు రాజకీయాలను అపహస్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు మిత్రపక్షంగా తమకూ అప్రతిష్ట తెచ్చి పెడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీకి బహిరంగ లేఖలు రాశారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరికకేనన్న కాల్వ

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరికకేనన్న కాల్వ

పురందేశ్వరి బహిరంగ లేఖపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. వైఎస్ జగన్మోహనరెడ్డిని అడిగే లేఖ రాశారా? అని నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక కోసమే పురంధేశ్వరి విమర్శలు చేస్తున్నారని ఆరోపణలకు దిగారు. మరొక నేత మరో అడుగు ముందుకేసి ఆమె బీజేపీలో చేరినప్పుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారా? అని ఎదురు సవాల్ చేశారు.

టీడీపీకి ధీటుగానే పురందేశ్వరి

టీడీపీకి ధీటుగానే పురందేశ్వరి

టీడీపీ నేతల విమర్శలకు పురందేశ్వరి ఘాటుగా స్పందించారు. తానే రాజీనామా చేశాకే కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరానని, తన తండ్రి కూడా ఇటువవంటి రాజకీయాలు చేయలేదని ఎదురుదాడికి దిగారు. బీజేపీ రాష్ట్ర నేతల నుంచి పురందేశ్వరి వ్యాఖ్యలకు మద్దతు లభించింది.

పురందేశ్వరికి బీజేపీ నేతల మద్దతు

పురందేశ్వరికి బీజేపీ నేతల మద్దతు

అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్న బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అదే సమయంలో పురందేశ్వరి వ్యాఖ్యల్లో, లేఖలో తప్పిదమేమున్నదని ప్రశ్నించారు.
తనకు అవకాశమొస్తే అలా చేయబోనని, వారితో రాజీనామా చేయించాకే మంత్రులుగా ప్రమాణం చేయిస్తానని వ్యంగ్యాస్త్రం సంధించారు.

వెంకయ్య వ్యంగ్యాస్త్రం

వెంకయ్య వ్యంగ్యాస్త్రం

మరోవైపు ఏపీ క్యాబినెట్ విస్తరణ మరుసటి రోజునే స్పందించిన కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు ఒక పార్టీకి నష్టం, బాధ కలుగుతుందని పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయాలా? మీడియాకు ఎదురు ప్రశ్నలు సంధించారు. అయినా పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని చురకలంటించారు.

English summary
AP CM Chandrababu has self defence with his cabinet expansion because with in the TDP has dissidents while opposition leader YS Jagan launch nationwide agitation. Another side BJP Senior leader Purandeswari wrotes letter to PM Modi and BJP President Amit Shah to target Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X