వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాబు, హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ నివాళి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్, పలువురు టిడిపి నేతలు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

అంతకుముందు ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేత హరికృష్ణ, ఆయన కుమారుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ ఆశించారన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని హరికృష్ణ అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం, మహిళలకు భద్రత కల్పించాలని అన్నారు.

ఎన్టీఆర్ కూతురు, భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించారు.

నివాళి

నివాళి

ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగుదేశం నేతలు నివాళులర్పించారు.

నివాళి

నివాళి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్, పలువురు టిడిపి నేతలు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

నివాళి

నివాళి

అంతకుముందు ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం పార్టీ నేత హరికృష్ణ, ఆయన కుమారుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలుగు ప్రజలు ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ ఆశించారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు, బాలకృష్ణ.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి వికలాంగుడికి తినిపిస్తున్న చంద్రబాబు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu and Harikrishna, Balakrishna, and Jr NTR visited NTR Ghat this early morning to pay respects to his late Legendary NT Ramarao, marking the eve of the latter Birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X