వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగ నిద్రలో బాబు, చరిత్రలో ప్రయోగం! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రులు, ఉన్నతాధికారులకు యోగ శిక్షణా శిబిరం నిర్వహించడం దేశ చరిత్రలోనే ఓ గొప్ప, వినూత్న ప్రయోగమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

స్వర్గమంటే ఆంధ్రప్రదేశే అనేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఈశా ఫౌండేషన్‌ సహకారంతో మూడు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌' కార్యక్రమం శనివారం ముగిసింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రయోగాలంటే తనకు ఇష్టమని, మంత్రులు, ఉన్నతాధికారులు నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. శిక్షణలో ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ తన ప్రసంగాలతో ఉత్తేజపరుస్తూ యోగాశిక్షణ ఇచ్చారని ప్రశంసించారు.

 ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

సమీప భవిష్యత్‌లో ఈకార్యక్రమాన్ని కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంలో సమష్టితత్వం పెంపునకు జాయ్‌ఫుల్‌ లివింగ్‌ సదస్సు దోహదపడిందన్నారు.

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ప్రభుత్వ నిర్వహణలో తాను చేసిన ప్రయోగాల్లోకెల్లా ఈశాఫౌండేషన్‌ ద్వారా ప్రభుత్వానికి శిక్షణ ఇప్పించడమే వినూత్నమైనదని పేర్కొన్నారు.

 ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సహోద్యోగులతో ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేర్చుకోవచ్చన్నారు.

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఈ సదస్సులో మంత్రులు, ఉన్నతాధికారులు ఎలాంటి అహాలు, భేషజాలు లేకుండా కలసిపోవడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

 ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

క్రీడలు, సంగీతం, వినోదం ద్వారా గతంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేవారని, కానీ, ప్రస్తుత జీవనశైలిలో అది కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వర్తిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని జగ్గీ వాసుదేవ్ అన్నారు. మనిషిని అంకిత భావమే మేధావిగా, దేవుడిగా మారుస్తుందని వివరించారు.

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు. సమస్యగా భావిస్తే దేన్నీ సాధించలేమని, అవకాశంగా భావిస్తే అద్భుతాలు సృష్టించొచ్చన్నారు.

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయ్‌ఫుల్‌ లివింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ను ఆనందప్రదేశ్‌గా మార్చేందుకు ఈశా ఫౌండేషన్‌ సహకరిస్తుందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

English summary
On the second day of yoga and meditation sessions on Friday, CM Chandrababu Naidu, his Cabinet colleagues and top bureaucrats were taught a series of asanas, kriyas and mudras and how meditation was a powerful tool for spiritual growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X