వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్నాలజీ గురించి చంద్రబాబుకు తెలియదా?: జగన్, నెహ్రు ఫైర్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: పర్యావరణానికి హాని కలిగించే చర్యల కారణంగానే సముద్ర తీరం కోతకు గురవుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆర్కే బీచ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సముద్ర తీరంలో కోత అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ ముప్పును నివారించడానికి విదేశాల్లో హెడ్ గ్రాయిన్ బ్రేక్ వాటర్ టెక్నాలజీని వాడుతున్నారని జగన్ తెలిపారు.

విదేశీ పర్యటనలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడుకు ఈ టెక్నాలజీ గురించి తెలియదా? అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా మేలుకుని సముద్ర తీరం కోతకు గురికాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 Chandrababu do not know Technology: YS Jagan

చంద్రబాబుపై ధ్వజమెత్తిన నెహ్రు

విజయవాడ: తెలుగుదేశం 8 నెలల పాలనలో ఏపికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని నెహ్రు ఆరోపించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలకు వెళ్లడానికి రూ. కోట్లు ఉన్నాయి కానీ, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ఏసి సిఎం చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.

రైతులకు ఎంతమేర రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రజల ఆశలు గల్లంతయ్యాయని దేవినేని అన్నారు. వెంకయ్యనాయుడు గతంలో ప్రత్యేక హోదా ఉంటుందని చెప్పి.. ఇప్పుడు మాటమారుస్తున్నారని దేవినేని నెహ్రు ఆరోపించారు.

English summary
YSR Congress President YS Jaganmohan Reddy on Tuesday said that AP CM Chandrababu Naidu do not know technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X