హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనే వచ్చాయి: జగన్, లోకేష్‌ను మెచ్చుకున్న బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రుణమాఫీ పైన సభాపతికి పేపర్స్ ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, తాము పేపర్లు ఇచ్చామో లేదో సభాపతి, మీడియానే అడగాలన్నారు. తాను సభలో చెప్పిన కేస్ స్టడీస్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలే అన్నారు.

ఎదుటి వారి పైన బురద చల్లడమే ప్రభుత్వం ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు. సీఆర్డీఏ బిల్లు అంశంలో ఇదే చేశారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ఫూలింగ్ చేశారన్నారు. చంద్రబాబు చివర్లో ప్రసంగం ముగించారే తప్ప క్లారిఫికేషన్ కోసం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదన్నారు.

చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలేనని, తమకు అసలు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదని అసెంబ్లీలో నిలదీశామన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ప్రభుత్వం నుండి సమాధానం లేదన్నారు.

Chandrababu is lying: YS Jagan says

ఎంతసేపు రాజధానికి వైసీపీ వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం చేశారన్నారు. అసెంబ్లీ ముగింపు సమావేశంలో చంద్రబాబు గంటసేపు మాట్లాడితే, తనకు కనీసం పది నిమిషాలు కేటాయించారా అని ప్రశ్నించారు.

లోకేష్‌కు చంద్రబాబు అభినందనలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వం విజయవంతమైనందుకు చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్‌ను అభినందించారు. మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. చంద్రబాబు, పలువురు నేతలు పాల్గొన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. రికార్డ్ స్థాయిలో 53 లక్షల సభ్యత్వం వచ్చిందన్నారు. సభ్యుల వివరాలు కంప్యూటరీకరించినట్లు చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసమే తాను ఆలోచిస్తానన్నారు. కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడంలో ముందుంటానని చెప్పారు. సభ్యత్వ నమోదు విజయవంతం అయినందుకు లోకేష్‌ను అభినందించారు.

English summary
Chandrababu is lying, says YSR Congress chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X