వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల బైపోల్: లోకేష్‌కు కీలక బాధ్యతలు, ఆ భయంతోనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నంద్యాల ఉపఎన్నిక పూర్తి బాధ్యతలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌కు అప్పగిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. కృత్రిమ నేత ఎక్కడంటూ లోకేష్‌పై వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు చేసిన రోజునే నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను లోకేష్‌కు అప్పగించడం గమనార్హం.

ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని టిడిపి నేతలు, పార్టీ శ్రేణులకు బాబు సూచించారు. టిడిపి సమన్వయకమిటీ సమావేశం గురువారం నాడు అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జరిగింది.

మౌనిక ప్రకటించిన 3 రోజులకే, భూమా ఫ్యామిలీకి పవన్ షాక్, టిడిపికి దెబ్బేనా?మౌనిక ప్రకటించిన 3 రోజులకే, భూమా ఫ్యామిలీకి పవన్ షాక్, టిడిపికి దెబ్బేనా?

సమావేశంలో ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికపైనే తీవ్రంగా చర్చించారు. నంద్యాలలో వైసీపీ చీఫ్ జగన్ అనుసరిస్తున్న వ్యూహంపై టిడిపి నేతలు చర్చించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా వైసీపీ ప్రయత్నిస్తోందని పలువురు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

నంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకంనంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకం

అయితే రెచ్చగొట్టి నంద్యాల ఉపఎన్నికను వాయిదా వేయించే ప్రయత్నాలను వైసీపీ చేస్తోందని టిడిపి నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు సూచించారు.

నంద్యాల బాధ్యతలు లోకేష్‌కు అప్పగింత

నంద్యాల బాధ్యతలు లోకేష్‌కు అప్పగింత

నంద్యాల ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రి అచ్చెన్నాయుడుకూ కీలక బాధ్యతలు అప్పగించారు. నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాప్‌రెడ్డి టిడిపిలో చేరడంలో అచ్చెన్నాయుడు కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు మరింత కేంద్రీకరించాలని టిడిపి భావిస్తోంది. దరిమిలా లోకేష్, అచ్చెన్నాయుడులకు కీలక బాధ్యతలను అప్పగించారు.

Recommended Video

Balakrishna Slapping his fan in election campaign at Nandyala : Video
ఎన్నిక వాయిదాకు వైసీపీ కుట్ర

ఎన్నిక వాయిదాకు వైసీపీ కుట్ర

నంద్యాల ఉపఎన్నికను వాయిదా వేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. సమన్వయకమిటీ సమావేశంలో ఈ ఎన్నికపై ప్రధానంగా చర్చ జరిగింది. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఈ సమావేశంలో కొందరు నేతలు బాబు దృష్టికి తెచ్చారు. వైసీపీ అంతర్గత సమావేశాల్లో కూడ ఇదే వైఖరితో ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఉపఎన్నికల ప్రచారం సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడుతో సహ కొందరు నేతలు ప్రస్తావించారు.గంగుల ప్రతాఫ్‌రెడ్డి టిడిపిలో చేరాలనే నిర్ణయంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకొందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

వైసీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న ప్రచారంతో పాటు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని టిడిపి భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఇప్పటికే వైసీపీ తీరుపై ఫిర్యాదు చేసిన విషయాన్ని టిడిపి నేతలు సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేని కారణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనే అభిప్రాయంతో టిడిపి నేతలున్నారు.

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతలు పుల్లారావుకు అప్పగింత

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతలు పుల్లారావుకు అప్పగింత

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతలను మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అప్పగిస్తూ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. కాకినాడ కార్పోరేషన్‌లో విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సెప్టెంబర్‌లో నిర్వహించే ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కూడ చర్చించారు. సెప్టెంబర్ 1వ, తేదిన టిడిపి వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

English summary
Tdp chief Chandrababu naidu allotted key incharge responsibilities on Nandyal by poll to Nara Lokesh and AcheNaidu. Tdp co-ordination meeting held at Amaravati on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X