వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరియస్‌గా ఉంటా: బీజేపీకి బాబు హామీ, అమిత్ షా కూడా తేల్చారు

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుల అంశం చర్చకు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుల అంశం చర్చకు వచ్చింది.

<strong>ప్రభాస్‌కు నరేంద్ర మోడీ బంపరాఫర్</strong>ప్రభాస్‌కు నరేంద్ర మోడీ బంపరాఫర్

అంతకుముందు బిజెపి నేతలు.. అమిత్ షాను కలిశారు. తెలుగుదేశం నేతలు పార్టీపై చేస్తున్న విమర్శలను వివరించారు. బిజెపి వల్లే ఓట్లు తక్కువగా వచ్చాయని, సీట్లు తగ్గాయని ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు.

నేతల మాటల యుద్ధంపై చర్చ

నేతల మాటల యుద్ధంపై చర్చ

ఈ అంశం అమిత్ - చంద్రబాబులు భేటీ అయినప్పుడు చర్చకు వచ్చిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కలిసి ముందుకు సాగుదామని, 2019 పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని నేతలు చర్చించుకున్నారని తెలుస్తోంది.

అమిత్ షాకు చంద్రబాబు హామీ

అమిత్ షాకు చంద్రబాబు హామీ

టిడిపి, బిజెపి నేతల వాగ్యుద్ధం అంశం కూడా చర్చకు వచ్చింది. తమ పార్టీ నేతలు ఇక నుంచి ఏమైనా అంటే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు.. అమిత్ షాకు హామీ ఇచ్చారు.

తప్పు చేస్తే చర్యలు

తప్పు చేస్తే చర్యలు

బిజెపి వల్లే తనకు ఓట్లు తగ్గాయని ఎంపీ కేశినేని నాని ఇటీవల అన్నారు. ఈ విషయాన్ని బిజెపి నేతలు అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు. కేశినేని నాని సహా నేతలు ఎవరు బిజెపిపై అదుపు తప్పి మాట్లాడినా తాను చర్యలు తీసుకుంటానని బీజేపీ జాతీయ అధ్యక్షులకు టిడిపి చీఫ్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలను విమర్శిస్తే తాను చేసిన హెచ్చరికలను ఈ సందర్భంగా చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంలో మరింత సీరియస్‌గా ఉంటానని అన్నారని సమాచారం.

అదుపులో ఉంచుతామని..

అదుపులో ఉంచుతామని..

అదే సమయంలో పలువురు బిజెపి నేతలు కూడా టిడిపిని విమర్శించడాన్ని అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లారు. వారిని కూడా అదుపులో ఉంచుతామని ఆయన చెప్పారని తెలుస్తోంది. 2019 వరకు మిత్రపక్షాలుగా ముందుకు వెళ్దామని చర్చించుకున్నారు. మొత్తానికి పొత్తు విషయంలో కలిసి వెళ్లాలని తేలిపోయింది.

బాబుకు వెంకయ్య సమర్థన

బాబుకు వెంకయ్య సమర్థన

చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా సమర్థించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కలిసి ముందుకు సాగుదామని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కాగా, అంతకుముందు బిజెపి నేతలు అమిత్ షాకు టిడిపిపై ఫిర్యాదు చేశారు.

English summary
The status of the Telugu Desam Party-BJP alliance came up for discussion between Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu and BJP national president Amit Shah at a meeting over lunch hosted by the Cheif Minister at his residence in Vijayawada on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X