వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా బాబు, ఆ గొడుగులకు భలే గిరాకీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు రెండోసారి ఎన్నికయ్యారు. విశాఖలో జరుగుతున్న మహానాడు మూడో రోజు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు రెండోసారి ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖలో జరుగుతున్న మహానాడు మూడో రోజు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చంద్రబాబు మొత్తంగా 22 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విభజనకు ముందుతో పాటు విభజన తర్వాత రెండుసార్లు ఎన్నికయ్యారు.

హరికృష్ణ మళ్లీ బాబుని టార్గెట్ చేశారా?హరికృష్ణ మళ్లీ బాబుని టార్గెట్ చేశారా?

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు అధ్యక్షులు ఉంటున్నారు. చంద్రబాబును టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనను రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మహానాడు వేదిక పైనే ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఎన్నికను ఎన్నికల అధికారి పెద్దిరెడ్డి ప్రకటించారు.

Chandrababu Naidu elected as TDP national president for second time

టిడిపి మహానాడులో తీర్మానాలు

మహానాడులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పలు తీర్మానాలు ప్రవేశ పెట్టారు.

1. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌కు మద్దతు
2. నేతల అవినీతిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ.
3. కేంద్ర ఆర్థిక సంస్కరణలకు స్వాగతం.
4. విభజన హామీలు సత్వరం అమలు చేయాలి
5. ఈవీఎంలపై సందేహ నివృత్తి.. తదితర అంశాలపై తీర్మానాలు చేశారు.

ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో టిడిపి మహానాడు మూడో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. సోమవారం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడ గొడుగులకు భలే డిమాండ్‌ ఏర్పడింది.

చంద్రబాబు, లోకేష్, టిడిపి గుర్తు, పసుపు రంగులో రూపొందించిన ఈ గొడుగులు కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపించారు. కాగా, మూడు రోజుల మహానాడులో పార్టీకి రూ.7.51 కోట్ల నిధులు వచ్చాయి.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu elected as Telugudesam Party National President for second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X