వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలుకు పంపిస్తా: బాబుకు షాకివ్వబోయి అడ్డంగా బుక్కైన వైసిపి కార్యకర్తలు!

ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఓ సంఘటనను ఆయన ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనలో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఓ సంఘటనను ఆయన ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు.

నంద్యాలలో పర్యటన

నంద్యాలలో పర్యటన

నంద్యాల ఉప ఎన్నికపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన శనివారం, ఆదివారం నంద్యాలలో పర్యటించారు.

Recommended Video

Chandrababu Naidu Survey Report on Ministers
నాకు ఆసక్తికర సంఘటన ఎదురైందని.

నాకు ఆసక్తికర సంఘటన ఎదురైందని.

అనంతరం ఆదివారం రోడ్లు, భవనాల గెస్ట్ హౌస్ వద్ద కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన సంఘటనను ఆయన చెప్పారు.

బాబు అలా చెప్పగానే జారుకున్న వైసిపి కార్యకర్తలు

బాబు అలా చెప్పగానే జారుకున్న వైసిపి కార్యకర్తలు

యాలూరు పర్యటనలో కొందరు వైసిపి కార్యకర్తలు పింఛన్లు రాలేదని, రుణమాఫీ కాలేదంటూ బురద జల్లే ప్రయత్నాలు చేశారని చంద్రబాబు చెప్పారు. అప్పుడు తాను.. నీ పేరు చెప్పు.. ఇప్పుడే పరిశీలిస్తానని చెప్పానని, ప్రభుత్వ సాయం అందకపోతే వెంటనే ఇస్తానని, నీది తప్పని తేలితే జైలుకు పంపిస్తానని చెప్పగానే అక్కడి నుంచి జారుకున్నారని గుర్తు చేశారు.

వ్యాపార రాజకీయాలు వద్దు

వ్యాపార రాజకీయాలు వద్దు

ఎన్నికల నేపథ్యంలో ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. తప్పును ఎత్తిచూపి అవతల వ్యక్తిని ఢీకొడదామని చంద్రబాబు చెప్పారు. వ్యాపార రాజకీయాలు మనకొద్దని హితవు పలికారు. ఫ్లైయింగ్‌స్క్వాడ్‌లా ప్రజాప్రతినిధులు తిరిగితే సరిపోదని, ప్రజలతో మమేకం కావాలన్నారు. రూ.కోట్ల విలువైన 50 ఎకరాల నీటి పారుదల భూమిని పేదలకు ఇచ్చేందుకు, నంద్యాలలో ఇళ్లు కట్టిస్తానన్న హామీని నెరవేర్చేందుకు సంకల్పించామన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu gave shock to YSRCP Congress activist in his Nandyal tour on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X