వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనీ ప్లాన్ అడిగిన బాబు, సింగపూర్లో ఎన్నో తెలుసుకొని.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం మంగళవారం రాత్రి సింగపూర్ నుండి హైదరాబాద్ చేరుకుంది. రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు.. వ్యర్థాల నుండి సంపద సృష్టించే అంశంపై దృష్టి సారించారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం, మురుగు కాలువను నదిగా తీర్చిదిద్ది చుట్టుపక్కల ప్రాంతాలకు విలువను పెంచేందుకు సింగపూర్ అనుసరించిన విధానాన్ని పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ప్లాన్‌ను రూపొందించిన సింగపూర్ ప్రభుత్వం, నిర్మాణానికి అవసరమయ్యే నిధుల సమీకరణకు సైతం మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాజధాని ప్రణాళిక బావుందని, రాబోయే వెయ్యేళ్ల వరకూ పనికొచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే నిధులను ఎలా సమీకరించాలో ప్రణాళిక కూడా ఇస్తే బావుంటుందని సింగపూర్ ప్రభుత్వానికి సూచించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

సింగపూర్ అనుసరిస్తున్న ఆర్ధిక ప్రణాళికలు మెరుగైనవని, వాటిని తాము కూడా అనుసరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు తమకు అందుబాటులో లేవని, నిధులుంటే భూసమీకరణకు బదులు భూసేకరణకే వెళ్లేవాళ్లమని సింగపూర్ ప్రతినిధులకు వివరించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

సింగపూర్ ట్వాస్ వద్దనున్న కెప్పెల్ ప్లాంటును చంద్రబాబు బృందం పరిశీలించింది. చెత్తనుంచి విద్యుత్ తయారీకి అనుసరిస్తున్న విధానాలను కెప్పెల్ ప్లాంట్‌లో పరిశీలించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

కార్పొరేషన్‌లో సింగపూర్ ప్రభుత్వానికి 24.5 శాతం వాటాఉందని, ప్లాంట్ నుంచి 54 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు అధికారులు వివరించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

కెప్పెల్ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

ప్లాంట్ అధికారులతో అందుబాటులో ఉంటూ సమన్వయం చేసుకోవాలని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

అంతకుముందు సింగపూర్‌లోని హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డును ఏపీ బృందం సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించే పక్కా భవనాలను మరిన్ని సదుపాయాలతో లబ్దిదారులకు అందించేందుకు ఉన్న అవకాశాలపై కూడా హెడ్‌డిబి అధికారులతో చర్చించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదేళ్ల వ్యవధిలో వ్యాపారం - వాణిజ్యానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ పరిశోధనలను చేస్తుంది.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

ఇందుకు సంబంధించిన ఒప్పందంపై కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సంతకాలు చేశారు. త్రైపాక్షిక ఒప్పందం 2018 మార్చి 31 వరకూ అమల్లోవుంటుంది.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

మురుగు నీటిని నదిలా మార్చి పచ్చదనంతో నింపిన బిషనస్ పార్కును చంద్రబాబు బృందం సందర్శించింది. పార్కులో కలియతిరిగి అక్కడ నిర్వహిస్తున్న పచ్చదనం, పరిశుభ్రతను పరిశీలించారు. ఒక మురుగు కాలువను నదిలా ఎలా మార్చవచ్చో బిషన్ పార్కు అధికారులు చంద్రబాబుకు వివరించారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

టొపయో టౌన్లో 150 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కును అద్భుతంగా తీర్చిద్దిదిన క్రమాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

ఇదే తరహాలో ఏపీలోని కాలువలు, నదులను అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ నిపుణుల సహకారంపై ఆరా తీశారు.

 చంద్రబాబు బృందం

చంద్రబాబు బృందం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం మంగళవారం రాత్రి సింగపూర్ నుండి హైదరాబాద్ చేరుకుంది.

రెండు రోజుల పర్యటనలో... చంద్రబాబు ప్రతినిధి బృందం సింగపూర్‌కు చెందిన మంత్రులు, పారిశ్రామికవేత్తలు, రాయబారులు, అధికారులను కలిసింది. వారికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ విధానాలను వివరించింది. ఈక్రమంలో ప్రతినిధి బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి కె షణ్ముగం, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్ ఈశ్వరన్‌తోనూ వేర్వేరుగా సమావేశమైంది. పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు.

మంగళవారం సీనియర్ మినిస్టర్ గోచాక్ టాంగ్‌తో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో నిధుల సమీకరణలో సైతం సింగపూర్ తోడ్పాటు అందించి ప్రపంచశ్రేణిగా వెలిగొందేలా ఆంధ్ర రాజధాని నిర్మాణానికి సహకరించాలని సిఎం బృందం కోరింది. ఇప్పటికే అనేక దేశాలు స్మార్ట్ సిటీల నిర్మాణంలోనూ, ఇతర తోడ్పాటుకు ముందుకు వస్తున్నాయని, విశాఖపట్టణాన్ని స్మార్టు సిటీగా రూపొందించేందుకు అమెరికా ముందుకొచ్చిందని చంద్రబాబు చెప్పారు.

English summary
Chandrababu Naidu keen on implementing ABC water policy for new AP capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X