అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా ఊర్లో డాక్టర్లు లేరంటూ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

తన స్వంత గ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ:తన స్వంత గ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు రెండో రోజు విజయవాడలో కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేలపై సమీక్షలు నిర్వహించారాయన.

 Chandrababu naidu launches people's hub soft copy

ప్రజాసాధికార సర్వే వివరాలను పీపుల్స్ హజ్ పేరిట ప్రభుత్వం భద్రపరిచింది. ఇటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు సిఎం. ప్రజాసాదికార సర్వే 80 శాతం పూర్తైందన్నారు. మిగిలిన 20 శాతాన్ని మూడు నెలల్లో పూర్తిచేస్తామని ఐటీ అధికారులు సీఏంకు తెలిపారు.

ఆసుపత్రుల్లో వైద్యుల కొరతపై అధికారులను సీఎం నిలదీశారు. వైద్యుల కొరత సమస్య వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైతే అవుట్ సోర్సింగ్ పద్దతిలో వైద్యులను రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. తన స్వగ్రామంలో కూడ వైద్యుల కొరత ఉందన్నారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

English summary
Andhrapradesh chiefminister Chandrababu naidu launched people's hub soft copy at collector's confence in Amaravati on Friday. There is no doctor in my home town said Babu in this review meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X