వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొడవలెందుకు?: గవర్నర్‌తో బాబు భేటీ, కేసీఆర్ కోరిక-కీలక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు వీరి సమావేశం కొనసాగడం గమనార్హం. పరిపాలన వ్యవహరాలతోపాటు ఇతర కీలక అంశాలను ఈ సందర్భంగా గవర్నర్‌తో చంద్రబాబు చర్చించారు.

విభేదాల్లేవ్: గవర్నర్

మంత్రివర్గ విస్తరణ, హైదరాబాద్‌లోని ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వంకు అప్పగించే విషయంపైనా చర్చించినట్లు తెలిసింది. కాగా, భేటీ అనంతరం గవర్నర్ నర్సింహన్ మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు ఏమీ లేవని, సమస్యలను చర్చలు జరుపుకుని పరిష్కరించుకుంటున్నాయని చెప్పారు.

గొడవలతో ప్రయోజనం లేదు: చంద్రబాబు

భేటీ అనంతరం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి.. గవర్నర్‌ను కలవడం అనేది సాధారణ విషయమేనని అన్నారు. ఇటీవల కాలంలో తాను హైదరాబాద్ వెళ్లటం బాగా తగ్గినందు వల్ల గవర్నర్ కలవలేకపోయానని, అయితే, గవర్నరే ఇక్కడి రావడంతో ఆయనను కలిసినట్లు తెలిపారు. అందుకోసమే కొంత ఎక్కువసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నామని చెప్పారు.

 Chandrababu Naidu met ESL Narsimhan

గొడవలతో ఎవరికీ లాభం లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనం మేరకు ఇచ్చుపుచ్చుకునే దోరణి అవలంభిస్తున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు.
కాగా, తమిళనాడుకు తాగు నీళ్లు కావాలంటే ఇస్తున్నామని ఆయన చెప్పారు. గొడవలతో సమయం వృథా తప్ప మరేం ప్రయోజనం లేదని అన్నారు.

 Chandrababu Naidu met ESL Narsimhan

అయితే రాష్ట్ర ప్రయోజన విషయంలో రాజీపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు తమ నీటి ప్రాజెక్టులను చంద్రబాబే అడ్డుకుంటున్నారని విమర్శలు చేయడంపై స్పందిస్తూ.. ఎవరెవరో ఏవేవో మాట్లాడతారని అన్నారు.

 Chandrababu Naidu met ESL Narsimhan

హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వం అప్పగించాలని గవర్నర్ కోరిందని, దీనిపైనా ఈ భేటీలో చర్చించామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపైనా గవర్నర్‌తో చర్చించినట్లు తెలిపారు. ఈ రెండు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

కాగా తాము కేంద్రంతో కూడా సఖ్యతగానే ఉంటున్నట్లు తెలిపారు. అందువల్లే ఏపీకి కేంద్రం నిధులు వస్తున్నాయని చెప్పారు. ఎస్పీసీఎల్ లోకి తాజాగా 62వేల కోట్లు వచ్చాయని తెలిపారు.

 Chandrababu Naidu met ESL Narsimhan

కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అనేక పరిశ్రమలు కూడా రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయని తెలిపారు. కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువ రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అయ్యే వరకు కేంద్రం చేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Friday met governor ESL Narsimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X