నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నంద్యాల ప్రజల్లో అసంతృప్తి: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.నంద్యాల ప్రజల్లో తమపై అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు.ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసివచ్చే ఏ చిన్న అవకాశన్నీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ప్రజల్లో తమపై అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు.

ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసివచ్చే ఏ చిన్న అవకాశన్నీ వదులుకోవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. అంతేగాక, ఐదుగురు మంత్రులు, 12మంది ఎమ్మెల్యేలకు నంద్యాల ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

chandrababu naidu on Nandyal people

మరికొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలో ప్రచారం చేసే విధంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఎలాగైనా గెలుపొందాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది.

బాధ్యులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి ప్రజలకు చేరువ కావాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలని అన్నారు. అదే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా నంద్యాల ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది.

English summary
Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu said that Nandyal peoples are not satisfied with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X