అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్‌పై చంద్రబాబు, సభా వేదికపై ఆమెకు ధైర్యం చెప్పిన సీఎం

డ్రగ్స్ వంటి వాటిని తమ ప్ర‌భుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంద‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బుధవారం అన్నారు. అనంత‌పురంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: డ్రగ్స్ వంటి వాటిని తమ ప్ర‌భుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంద‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బుధవారం అన్నారు. అనంత‌పురంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

చదవండి: ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైయస్ జగన్

మంచి విలువ‌లపై స‌మాజంలో చ‌ర్చ‌లు జ‌రిగేలా కూడా తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. డ్ర‌గ్స్ వంటి వాటి జోలికి పోకుండా యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

చెడు అల‌వాట్ల‌కు గురిచేసే ఇటువంటి చ‌ర్య‌ల ప‌ట్ల త‌మ ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉంటుంద‌ని చెప్పారు. చెడు అల‌వాట్ల ప‌ట్ల యువ‌త ఆక‌ర్షితులు కాకూడ‌ద‌ని సూచించారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉన్మాదానికి, ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పని చేయాలని చెప్పారు. ఏలాంటి విషాద ఘటనలు జరిగినా అధైర్యపడొద్దన్నారు.

సమాజం కూడా అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. చెడు అలవాట్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, డ్రగ్స్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, సామాజిక విలువలపై ప్రజల్లో చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

Chandrababu Naidu responds on drugs issue

నేనున్నా.. అధైర్యపడొద్దు

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటన తననెంతో బాధించిందని చంద్రబాబు అంతకుముందు అన్నారు. భార్య, ఒక కుమార్తెను హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన రామసుబ్బా రెడ్డి కుటుంబంలో చోటుచేసుకున్న ఘటన విషాదకరమైందన్నారు.

తల్లిదండ్రులు, తోబుట్టువును కోల్పోయి అనాదిగా మిగిలిన లక్ష్మీ ప్రసన్న అనే యువతిని భగవంతుడే కాపాడాడని వ్యాఖ్యానించారు.

చదవండి: 'అలాంటి తండ్రి ఎవరికీ వద్దు', 'ప్రత్యూషకు రూ. 25 లక్షలు సహయం'

అనంతపురం పర్యటనలో భాగంగా ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి.. లక్ష్మీప్రసన్నను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు బహిరంగ సభావేదికపై ఆ యువతికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆ అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించి ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

లక్ష్మీప్రసన్నకు అండగా ఉంటానని చెప్పారు. ఆమె బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు వేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగం కూడా రిజర్వ్ చేసి మెంటరింగ్‌ చేస్తానని, ఏ స్థాయికి వెళ్లాలనుకుంటావో అప్పటి వరకు తాను ఆదుకుంటానని చంద్రబాబు చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu responded on drugs issue in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X