వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నావల్లే: బాబు, 'అంతమాటా.. సారీ చెప్పు, టిడిపి ఎంపీలు ఏపీలో పెట్టుబడి పెట్టట్లేదేం'

|
Google Oneindia TeluguNews

గుంటూరు: విభజన సమయంలో మనకు అన్యాయం జరిగిందని, అవమానం కూడా జరిగిందని, ఒక్క చంద్రబాబు తప్ప వేరెవ్వరూ రాష్ట్రానికి జరిగిన న్యాయం చేయలేరని ప్రజలను తనను గెలిపించారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

వాగును పరిశీలించిన సీఎం

వాగును పరిశీలించిన సీఎం

ఆయన సోమవారం నాడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. జిల్లెలమూడి వద్ద నల్లమడ వాగును ఆయ‌న పరిశీలించారు. వ‌ర‌ద‌ల‌తో నిండిన ప్రాంతాలపై అధికారుల‌కు పలు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లోమాట్లాడారు.సమస్యల‌కు శాశ్వత పరిష్కారం చేసే దిశ‌గా తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. నల్లమడ వాగు వెడల్పు పనులకి అక్క‌డి ప్ర‌జ‌లు సహకరించాలని కోరారు. విభజన సమయంలో అన్యాయం జరిగింది కాబట్టి, ఆ అన్యాయాన్ని సరిచేసేది తానే అని ప్రజలు గెలిపించారన్నారు.

పోరాడుతా

పోరాడుతా

అన్ని స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి తాను పోరాడుతున్నానని చెప్పారు. విజ‌భ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌న్నీ నెర‌వేర్చాల‌ని కేంద్రాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. 2108 లోపు పోల‌వ‌రం పూర్తి చేస్తే బాధ్య‌త తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు.ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రంలో పర్యటిస్తున్నానని చెప్పారు. ప్ర‌తి సోమ‌వారం తమకు సోమ‌వారం కాదని, పోలవారం అన్నారు. తాను దీక్ష‌తో ప‌ని చేస్తున్నానని, న‌దుల అనుసంధానంతో క‌ర‌వు లేకుండా చేస్తున్నామన్నారు.

ఇంజినీర్లకు బాబు క్షమాపణలు చెప్పాలని బ్రహ్మానంద రెడ్డి

ఇంజినీర్లకు బాబు క్షమాపణలు చెప్పాలని బ్రహ్మానంద రెడ్డి

ఇంజినీర్లు అసమర్థులన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని వైసిపి నేత బత్తులు బ్రహ్మానంద రెడ్డి సోమవారం అన్నారు. దేశంలోని గొప్ప ఇంజినీర్లుమన తెలుగు గడ్డ పైన పుట్టిన విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. నాసాలో కూడా 36 శాతం ఇంజినీర్లు భారతీయులే అన్నారు. వెంటనే ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

టిడిపి ఎంపీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదేం?

టిడిపి ఎంపీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదేం?

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారో చెప్పాలని నిలదీశారు. హోదా అవసరం లేదంటున్న టిడిపి నేతలు ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. ఇటీవల రాయలసీమలో పర్యటించిన చంద్రబాబు.. తన మొహమాటంతో ఇన్నాళ్లు శిక్షించకుండా వదిలేశానని, తన వేగాన్ని అందుకోవాలని లేదంటే వెళ్లిపోవాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
AP CM Chandrababu Naidu tours in Guntur district, YSRCP demand for CM sorry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X