వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను 'జగన్ గారు' అనే వాడిని కానీ, భయపడను: బాబు ఆవేదన

తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మాట జారలేదని సీఎం చంద్రబాబు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జగన్ తనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: తన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మాట జారలేదని సీఎం చంద్రబాబు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జగన్ తనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. ఆయన బలిజ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

అందుకే అందరూ నంద్యాలలో: సుజనా వ్యాఖ్య, జగన్ చెబుతోంది నిజమా?అందుకే అందరూ నంద్యాలలో: సుజనా వ్యాఖ్య, జగన్ చెబుతోంది నిజమా?

జగన్ గారు అనే వాడిని కానీ

జగన్ గారు అనే వాడిని కానీ

తాను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ మాట జారలేదని చంద్రబాబు చెప్పారు. జగన్ గురించి మాట్లాడినా జగన్ గారు అని సంబోధించేవాడినని చెప్పారు. కానీ జగన్ చాలా నీచంగా మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ అనుభవమంత వయస్సు ఆయనకు లేదన్నారు.

కాల్చేస్తామన్నా.. భరిస్తున్నా

కాల్చేస్తామన్నా.. భరిస్తున్నా

కాల్చేస్తాం, ఉరేస్తాం అన్నా తనకు భయం లేదని చంద్రబాబు చెప్పారు. బెదిరింపులకు భయపడే వాళ్లం కాదన్నారు. ప్రజల కోసం ఇదంతా భరిస్తున్నానని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని చంద్రబాబు అన్నారు. మెజార్టీ ఎంత అన్నదే తేలాలని చెప్పారు.

వదిలిపెట్టమని హెచ్చరిక

వదిలిపెట్టమని హెచ్చరిక

ముస్లింలను విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పైకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లీంల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పేదలపై అరాచకాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు.

కుట్రలకు భయపడేది లేదు

కుట్రలకు భయపడేది లేదు

కొందరు పేదవాళ్ల భూములు కాజేసి ఇబ్బందిపెడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. కులం, మతం పేరుతో వేధించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు పేదవాళ్లకు అండగా ఉండాల్సింది పోయి అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu unhappy with YSR Congress Party chief YS Jaganmohan Reddy's comments on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X