విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా పూర్వజన్మ సుకృతం:చంద్రబాబు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ, డ్వాక్రా సంఘాల బలోపేతం, బెల్టుషాపుల రద్దు, పెన్షన్ల పెంపు హామీని నెలబెట్టుకున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అవసరమైన ప్రాజెక్టులను కట్టలేదని, పేదలకు పప్పు బెల్లం చూపించి దోచుకున్నారని ఆరోపించారు. మన కష్టాలు తెలుసుకోకుండా విభజన చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం మహిళలకే ఇస్తామన్నారు. కొందరు అబద్దాలు చెప్పి మహిళలను మభ్యపెడుతున్నారని అన్నారు. మహిళలను ముందుకు నడిపే బాధ్యత తనదే అని చంద్రబాబు పేర్కొన్నారు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని రిబ్బన్ కటింగ్ ద్వారా ప్రారంభిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ గురించి అడిగి తెలుసుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో ఏర్పాటు రైతు బజార్ స్టాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో కొబ్బరి బొండాలను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో నవ ధాన్యాలను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో బయో గ్యాస్ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో ఎన్టీఆర్ ఇంటి నమూనాలను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

రైతు సాధికార సంస్ధ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్ధ కార్యాలయంలో గొర్రె పిల్లతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

రైతు సాధికార సంస్థను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతంగా చంద్రబాబు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వ్యవసాయశాఖ కార్యాలయాలను గన్నవరంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని బాబు హామీ ఇచ్చారు.

రాబోయే కాలంలో ఎరువుల వాడకాన్ని బాగా తగ్గిద్దామని అన్నారు. ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల పంట దిగుబడి పెరుగకపోగా, ఖర్చులు పెరిగాయని అన్నారు. అన్నం పెట్టే రైతు ఆకలితో ఉండడానికి వీలు లేదని చంద్రబాబు అన్నారు. వ్యవసాయానికి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.

ఈ-కామర్స్‌ పోర్టల్‌ ద్వారా ఇంటినుంచే పంట అమ్మేలా చేస్తానన్నారు. ఒంగోలు గిత్త జాతి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.

English summary
CM N.Chandrababu Naidu visit and Rythu Sadhikaratha samastha inauguration photos Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X