విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కటి ఓడినా చెక్, ఎంఏల్ సి ఎన్నికల్లో విజయం సాధించాలి, జగన్ పార్టీని టార్గెట్ చేయొద్దన్న బాబు

ఎంఏల్ సి ఎెన్నికల్లో ఒక్క సీటును ఓడినా ఊరుకోనని ఎపి సిఎం చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై క

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఎంఏల్ సి ఎన్నికలను మంత్రులంతా సీరియస్ గా తీసుకోవాల్సిందేనని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులకు సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదన్నారు సిఎం.

అమరావతిలో తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ గురువారం రాత్రి సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన తీరుపై చర్చించారు. వ్యక్తిగత దూషణలకు సభ్యులంతా దూరంగా ఉండాలని బాబు సూచించారు.

అసెంబ్లీ జరిగే సమయంలో రోజు గంటపాటు వ్యూహ కమిటీతో తాను భేటీ కానున్నట్టు బాబుచెప్పారు. ఎంఏల్ సి ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని బాబు సూచించారు.

ఒక్క ఎంఏల్ సి ఓడినా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బాబు పార్టీ నాయకులను హెచ్చరించారు. వైసిపి ఎంఏల్ఏ రోజా అసెంబ్లీ నుండి సస్పెండ్ అయిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.ఎంఏల్ఏ అనిత ఈ వ్యవహరాన్ని ప్రస్తావించారు.

అయితే సభ ప్రారంభమయ్యాక ఈ విషయమై చూద్దామని బాబు చెప్పాడు. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలనే అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ప్రజలకు సమాధానం చెప్పేలా వ్యూహత్మకంగా వ్యవహరిద్దామని బాబు సూచించారు.ఇప్పటివరకు అమలు చేసిన పథకాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి బాబు.

English summary
chandrababu naidu warned to party leaders about mlc elections.Babu ordered to party leaders take necessary steps for win seat in mlc polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X