అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజనపై మళ్లీ, లోకేష్‌కు బెస్టఫ్ లక్: ఆ కేసులో ఏముంది.. ఓటుకు నోటుపై బాబు

రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు సహకరించారని, విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు సహకరించారని, విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. 2029 నాటికి ఏపీని దేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

అరవై ఏళ్ల తర్వాత నవ్యాంధ్రలో అసెంబ్లీ సమావేశాలు తొలిసారి జరిగాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. టిడిపి పుట్టినప్పటి నుంచి బీసీలు అండగా ఉన్నారని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని చెప్పారు.

ఒక నాయకుడి ప్రవర్తన ఎటువంటి చెడు ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు అమెరికా ఉదాహరణ అన్నారు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు విచారణ అంశంపై మాట్లాడుతూ.. తన పైన ఎన్నో కేసులు పెట్టారు... అవన్నీ ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ప్రాసిక్యూషన్ చేసేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఇధి బాబుకు షాకే.

మన గడ్డ మీద ఓ చరిత్ర

మన గడ్డ మీద ఓ చరిత్ర

మన గడ్డ మీద అసెంబ్లీ నిర్వహించుకోవడం ఓ చరిత్ర అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజధాని అమరావతి కోసం భూసమీకరణ జరిగిందన్నారు. ల్యాండ్ పూలింగ్‌ను ఓ మోడల్‌గా తయారు చేశామన్నారు. 15 ఏళ్లు కష్టపడితే అమరావతి అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

విభజన సమస్యలు ఇంకా..

విభజన సమస్యలు ఇంకా..

విభజన వల్ల ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయని చంద్రబాబు చెప్పారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి పాలన చేసే అవకాశమున్నా అమరావతి నుంచే పరిపాలనించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

పట్టిసీమ ఓ చరిత్ర

పట్టిసీమ ఓ చరిత్ర

పట్టిసీమ ఓ చరిత్ర అని చెప్పారు. రికార్డు సమయంలో పట్టిసీమ పూర్తి చేశామన్నారు. పట్టిసీమతో తాగు, సాగు నీటి సమస్య తీర్చామన్నారు. కరెంట్ కోతను అధిగమించి మిగులు రాష్ట్రంగా అవతరించామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించారని చెప్పారు.

ప్రజల్లో అనైక్యతకు కొందరి ప్రయత్నం

ప్రజల్లో అనైక్యతకు కొందరి ప్రయత్నం

ప్రజల్లో అనైక్యత తేవాలని కొందరు ప్రయత్నించారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, వైసిపిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంలో స్పష్టమైన విజన్ ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చెప్పారు.

నిన్న సేఫెస్ట్ అమెరికా.. నేడు ఇలా..

నిన్న సేఫెస్ట్ అమెరికా.. నేడు ఇలా..

ఒకప్పుడు అమెరికా అత్యంత భద్రత కలిగిన దేశమని చంద్రబాబు అన్నారు. గతంలో ఎవరైనా అమెరికా వెళ్లేవారు.. తమనూ రావొచ్చు కదా అని అడిగేవారన్నారు. అమెరికా ప్రపంచానికి గైడెన్స్‌గా ఉన్న దేశమన్నారు. కానీ ఓ నాయకుడి వల్ల ఇఫ్పుడు అమెరికా ఎలా అయిందో చూడాలన్నారు.

రూ.వెయ్యి ఇంట్లో పెట్టుకుంటారుగా..

రూ.వెయ్యి ఇంట్లో పెట్టుకుంటారుగా..

డిజిటలైజేషన్ పైన కూడా చంద్రబాబు స్పందించారు. బ్యాంకులలో మినిమమ్ బ్యాలెన్స్ రూ.1000 ఉండాలంటే.. ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారు కానీ బ్యాంకులో పెట్టుకోరని చెప్పారు.

నారా లోకేష్‌కు ఆల్ ది బెస్ట్

నారా లోకేష్‌కు ఆల్ ది బెస్ట్

శాసన మండలి సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన తన తనయుడు నారా లోకేష్‌కు సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. లోకేష్ ఈ రోజు ఉదయం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

English summary
The Andhra Pradesh Assembly made history of sorts by holding its session for the first time outside Hyderabad after the bifurcation of the erstwhile united AP in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X