వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతోషమని పవన్‌కు బాబు చురక: స్నేహితుడని సుజన, కేశినేని ఎదురుదాడి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు స్పందించారు. హోదా పైన పవన్ మాట్లాడటం సంతోషకరమన్నారు. అదే సమయంలో పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.

తాను ఎవరికీ భయపడటం లేదని చెప్పారు. ఇకముందు కూడా భయపడనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీబీఐకి భయపడుతున్నారా అని పవన్ శనివారం ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన పైన 25 కేసులు పెట్టినా భయపడలేదన్నారు. అలాగే ప్రత్యేక హోదా పైన రాజీపడే ప్రసక్తి లేదన్నారు.

పవన్ కళ్యాణ్! వెంట్రుకతో సమానం, మోడీ ఉన్నంత కాలం రాదు: జేసీ సంచలనంపవన్ కళ్యాణ్! వెంట్రుకతో సమానం, మోడీ ఉన్నంత కాలం రాదు: జేసీ సంచలనం

నా స్నేహితుడు పవన్.. యాచించడం లేదు: సుజన

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సుజనా చౌదరి తిప్పికొట్టారు. తాము హోదాను యాచించడం లేదన్నారు. తాము తమ హక్కులను డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఆయన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. నేను ఏం చెప్పానో.. నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి సభలో అదే చెప్పారని, అందుకు సంతోషమని సజన పేర్కొన్నారు. తాను రాజ్యసభలో ఏం మాట్లాడానో చూడవచ్చునని ఓ వీడియో పోస్ట్ చేశారు.

టిడిపి ఎదురు దాడి

పవన్ కళ్యాణ్ తమ పైన మరోసారి చేసిన బిజినెస్ వ్యాఖ్యల పైన ఎంపీ కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదా పైన వవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. హోదా కోసం తాము రాజీనామాకైనా సిద్ధమన్నారు. తాము ఎవరి మోచేతి నీళ్లు తాగటం లేదన్నారు. ఏదైనా ఓ విషయంలో సామ, దాన, బేద, దండోపాయాలు ఉంటాయన్నారు.

టిడిపి నేతగా రాలేదు: పవన్ కళ్యాణ్ షాకివ్వడంతో ఎమ్మెల్యే, ఫ్యాన్స్‌కూ..టిడిపి నేతగా రాలేదు: పవన్ కళ్యాణ్ షాకివ్వడంతో ఎమ్మెల్యే, ఫ్యాన్స్‌కూ..

అవంతి శ్రీనివాస్, కేశినేని నాని, మురళీ మోహన్‌ల పేర్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని, కానీ వారు మొదటి నుంచి కష్టపడి సంపాదించుకున్నారని, రాజకీయాల ద్వారా సంపాదించలేదని బోండా ఉమ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు చెబితే అప్పుడు రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తమకు ప్రజలు ముఖ్యమని చెప్పారు. తాము ఎవరికీ భయపడటం లేదని, ఎవరితో లాలూచీ పడటం లేదన్నారు.

English summary
AP CM Chandrababu Naidu responds on Jana Sena chief Pawan Kalyan comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X