వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడట: జగన్‌పై బాబు, రాజధాని తరలింపుపై అనుమానాలు?

వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తప్పుబట్టారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తప్పుబట్టారు.

అమరావతిలో టిడిపి ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్లీనరీలో జగన్ వాస్తవాలు మాట్లాడలేదని మండిపడ్డారు. ఆయన అబద్దాలు మాట్లాడిన విషయం అందరికీ తెలుసన్నారు.

<strong>పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?</strong>పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?

జగన్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని, మాటలు మాట్లాడుతున్నారని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. వైసిపిని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్ గెలిపిస్తారని చెబుతున్నారని గుర్తు చేశారు.

<strong>అన్నొస్తున్నాడని చెప్పండి.. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర: గొంతు చించుకున్న జగన్, హోదాపై..</strong>అన్నొస్తున్నాడని చెప్పండి.. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర: గొంతు చించుకున్న జగన్, హోదాపై..

జగన్ అలా చెప్పడం ద్వారా తన అసమర్థతను నిరూపించుకున్నారని చంద్రబాబు ఎంపీలతో వ్యాఖ్యానించారు. ప్రజలంతా ప్రభుత్వ పక్షాణ ఉన్నారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్దామన్నారు.

జగన్‌కు అసూయ

జగన్‌కు అసూయ

కాగా, జగన్ వ్యాఖ్యలపై అంతకుముందు నారా లోకేష్ కూడా మండిపడ్డారు. చంద్రబాబు, ప్రభుత్వంపై జగన్‌ ప్లీనరీ వేదికగా చేసిన ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్‌ అసూయపడుతున్నారని, అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు.

చంద్రబాబుపై ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు

చంద్రబాబుపై ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు

చంద్రబాబు 40 ఏళ్లగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని, ఆయన మీద చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్ని ఎవరూ నిరూపించలేకపోయారన్నారు. చంద్రబాబును తిట్టడం కోసమే వైసిపి ప్లీనరీ ఏర్పాటు చేసినట్లుగా ఉందన్నారు.

చంద్రబాబు హామీలిస్తే అలా.. ఇప్పుడిలా..

చంద్రబాబు హామీలిస్తే అలా.. ఇప్పుడిలా..

జగన్‌ ప్రకటించిన హామీలన్నీ 2014 ఎన్నికల్లో తాము హామీ ఇచ్చి అమలు చేసినవేనని నారా లోకేష్ చెప్పారు. పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు నెరవేర్చలేని హామీలిచ్చారని విమర్శించిన జగన్‌.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అవే హామీలు తానూ ఇస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు. తన సారథ్యం మీద నమ్మకం లేకనే జగన్‌ ప్రశాంత్‌ కిషోర్‌ను తెచ్చుకున్నారన్నారు.

ప్లీనరీలో జగన్ ఇలా..

ప్లీనరీలో జగన్ ఇలా..

తాను సీఎం అయితే ఇవి చేస్తానంటూ జగన్ ప్లీనరీలో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. రైతుల కోసం వైయస్సార్ భరోసా, డ్వాక్రా మహిళల కోసం వైయస్సార్ ఆసరా, పిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకం, ఫీజు రీయింబర్సుమెంట్సుకు పూర్వవైభవం, ప్రత్యేక హోదా కోసం లౌక్యం, దౌత్యం, పోరాటం, మిగిలిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, 25 లక్షల ఇళ్లు, ఆరోగ్యశ్రీ బలోపేతం, విడతలవారీగా మధ్య నిషేదం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

రాజధాని మార్చడంపై స్పష్టత ఇవ్వని జగన్!

రాజధాని మార్చడంపై స్పష్టత ఇవ్వని జగన్!

జగన్ ప్రసంగం ప్రారంభిస్తూ.. విజయవాడ, గుంటూరు అంటూ జగన్‌ సంబోధించారు. జగన్‌ వస్తే రాజధాని ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి పంపించేస్తారంటూ మాట్లాడుతున్న చంద్రబాబుకు అర్థం కావడం కోసం, ఆయనకు చెప్పేందుకు ఇలా విజయవాడ, గుంటూరు అని సంబోధించానని తెలిపారు. అయితే తాను అధికారంలోకొస్తే రాజధానిని మారుస్తారా? ఇక్కడే కొనసాగిస్తారా అనేది మాత్రం స్పష్టం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన చెప్పిన వ్యాఖ్యలను చూస్తుంటే మాత్రం రాజధాని మారదు అనే అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

English summary
AP CM Chandrababu Naidu responded on YSRCP plenary and YS Jaganmohan Reddy comments in plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X